‘కన్నప్ప’ సినిమా విషయంలో ప్రభాస్ ను బాగా ఇబ్బంది పెట్టినట్టు వెల్లడించాడు మంచు విష్ణు. మరీ ముఖ్యంగా డైలాగ్స్ విషయంలో ప్రభాస్ కు భారీ డైలాగ్స్ ఇచ్చినట్టు తెలిపాడు.
“ప్రభాస్ ను బాగా ఇబ్బంది పెట్టాను. నాకు పెద్ద డైలాగులు పెట్టకు అని మొదట్నుంచి అంటూనే ఉన్నాడు. నేను సరే అంటూ చెబుతూ వస్తున్నాను. లొకేషన్ కు వచ్చేసరికి డైలాగ్ పేపర్స్ ఆయన చేతిలో పెట్టాను. ఒకట్రెండు లైన్లు తీసేశాం తప్ప, పెద్దగా ఏం మార్చలేదు. సినిమాలో డైలాగ్స్ బాగా ఎంజాయ్ చేశానని ప్రభాస్ చెప్పడం గొప్ప విషయం.”
‘కన్నప్ప’ కోసం ప్రభాస్ ను అడ్వాంటేజ్ గా తీసుకోలేందుటన్నాడు విష్ణు.
ఓ బాధ్యతగా తీసుకొని, ప్రభాస్ పాత్రను మలిచామని, సినిమాలో ప్రభాస్ పాత్ర హైలెట్ అవుతుందని అంటున్నాడు.
“ఈ సినిమాకు ఒప్పుకొని ప్రభాస్ నాకు సహాయం చేశాడు. అలా అని దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకోలేదు. అతడి స్టార్ డమ్ ను నేను పక్కాగా తెరపై చూపించాలి. అలా చూపించకపోతే తప్పు చేసినవాడ్ని అవుతాను. ప్రభాస్ నే కాదు, ఆయన ఫ్యాన్స్ ను కూడా గౌరవించాలి. అవన్నీ దృష్టిలో పెట్టుకొని రుద్ర పాత్ర డిజైన్ చేశాం.”
నటి శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) తన పారితోషికాన్ని తగ్గించాలన్న నిర్మాతల మాటకి నో చెప్పిందట. రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదే…
బాలీవుడ్‌కు వెళ్లిన తర్వాత తెలుగు సినీ పరిశ్రమపై విమర్శలు చేసిన హీరోయిన్లలో తాప్సీ, తమన్నా కన్పిస్తారు.. తెలుగు సినిమాల ద్వారానే…
అక్కినేని కోడలు శోభిత (Sobhita) లేటెస్ట్ స్టేట్ మెంట్ ఇది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా, షాకింగ్ గా అనిపించినప్పటికీ…దీని వెనక…
గత ఏడాది పూజ హెగ్డే (Pooja Hegde) ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు ఒప్పుకొంది. కానీ వాటి విడుదల చాలా…
ఇటీవల మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీమణుల్లో బాగా పాపులర్ అయిన నటి…అన్నా రాజన్ (Anna Raajan). ఆమె నటన…
రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)కి అన్నీ పెద్ద ప్రాజెక్ట్ లే దక్కుతున్నాయి. ఇప్పటికే యష్ సరసన "టాక్సిక్" సినిమా పూర్తి…