ప్రియాంక చోప్రాకి చాలా క్రేజ్ పెరిగింది. ముఖ్యంగా భారీ పాన్ ఇండియన్, పాన్ వరల్డ్ చిత్రాలకు ఆమె మొదటి ఛాయిస్ గా మారింది. ఇప్పటికే రాజమౌళి – మహేష్ బాబు సినిమాలో ఆమె మెయిన్ హీరోయిన్. హృతిక్ రోషన్ స్వీయ దర్శకత్వంలో రూపొందుతోన్న క్రిష్ 4 చిత్రంలో కూడా ఆమె హీరోయిన్.
అలాగే రణబీర్ కపూర్, యష్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్న “రామాయణం” సినిమాలో మొదట ప్రియాంకనే తీసుకోవాలనుకున్నారట. సూర్పనఖ పాత్రకు ప్రియాంకకి ఇవ్వాలనుకున్నారట. కానీ పారితోషికం ఇతర విషయాలను పరిగణనలోకి తీసుకొని డ్రాప్ అయ్యారు మేకర్స్.
దాంతో, ఆ పాత్ర రకుల్ ప్రీత్ సింగ్ కి దక్కింది. రకుల్ ప్రీత్ సింగ్ అలా ఒక భారీ సినిమాలో భాగం అయింది ఇప్పుడు. సూర్పనఖ పాత్ర రామాయణం కథకి కీలకం. ప్రియాంక భారీ పారితోషికం డిమాండ్ రకుల్ కి అలా కలిసొచ్చింది.
ప్రియాంక చోప్రా ప్రస్తుతం సినిమాకి 20 నుంచి 30 కోట్ల మధ్య తీసుకుంటోంది. పాత్ర, ఆ సినిమా బడ్జెట్ ని బట్టి ఆమె పారితోషికం డిసైడ్ అవుతుంది. ప్రస్తుతం ఇండియాలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్ ఆమెనే.
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నాగబంధం'(Nagabandham)లో నభా నటేష్ (Nabha Natesh) మెయిన్ హీరోయిన్ గా…
సినిమా అవకాశాలు తగ్గినా, తాను అనుకున్న తరహా పాత్రలు రాకపోయినా పర్వాలేదని, తనకంటూ ఒక సంతోషకరమైన వ్యక్తిగత జీవితం ఉందని…
రాజమౌళి (Rajamouli) సినిమా అంటే పాత రికార్డులు బద్దలవ్వాలి. కొత్త రికార్డులు స్టార్ట్ అవ్వాల్సిందే. వచ్చే ఏడాది విడుదల కానున్న…
రామ్ చరణ్ నటించిన "పెద్ది" (Peddi) సినిమా జూన్ 4న విడుదలైంది. 25 రోజుల తర్వాత ఈ సినిమా పూర్తి…
రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా మంచి పొజిషన్ లో ఉన్నాడు. పాపులారిటీ ఉంది. యూత్ లో క్రేజ్ ఉంది.…
వరుసగా సినిమాలు నిర్మిస్తోన్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ (Sithara Entertainments) వచ్చే నెల నుంచి నెలకో సినిమా విడుదల…