రాశి ఖన్నా పదకొండేళ్ల కెరీర్ చేసుకొంది. 2014లో విడుదలైన “ఊహలు గుస గుసలాడే” సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది. చాలా లాంగ్ కేరీర్ ఈ అమ్మడిది. ఇక ఇప్పుడు స్పెషల్ గీతాల్లోకి వచ్చింది.
ఇప్పటివరకు ఈ భామ ఐటెం సాంగ్స్ చెయ్యలేదు. “రాజా ది గ్రేట్” సినిమాలో ఒక పాటలో మెరిసింది కానీ అది ఐటెం సాంగ్ కాదు. ఇప్పుడు పూర్తిగా ఒక స్పెషల్ సాంగ్ చేస్తోంది.
సంక్రాంతికి విడుదల కానున్న “అనగనగా ఒక రాజు” చిత్రంలో ఈ భామ ఐటెం గాళ్ గా దర్శనమివ్వనుంది. తాజాగా ఈ పాట చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తుండగా, మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పుడు అదనపు ఆకర్షణగా రాశి ఖన్నా స్పెషల్ సాంగ్ చేరుతోంది.
రాశి ఖన్నా ఈ ఏడాది “తెలుసు కదా” చిత్రంలో నటించింది. అది ఫ్లాప్ అయింది. హిందీలో కూడా “120 బహద్దూర్” అనే సినిమాలో నటిస్తే అది ఆడలేదు. తమిళ్ లో కూడా ఒక సినిమాలో కనిపించింది. మొత్తంగా 2025లో మూడు భాషల్లో కలిపి మూడు సినిమాలు చేస్తే ఒక్కటీ హిట్ కాలేదు.
కానీ 2026 ఆమెకి బ్రైట్ గా కనిపిస్తోంది. ఆమె పవన్ కళ్యాణ్ సరసన నటించిన “ఉస్తాద్ భగత్ సింగ్”” వచ్చే వేసవిలో విడుదల కానుంది. ఇది ఆమె కేరీర్ కి పెద్ద చిత్రం. ఇక ఈ స్పెషల్ సాంగ్ కూడా వచ్చే సంక్రాంతి సీజన్ లో విడుదల అవుతోంది. అలాగే హిందీలో రెండు సినిమాలు ఉన్నాయి.
'చెన్నై లవ్ స్టోరీ' (Chennai Love Story సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). శ్రీ గౌరీప్రియ…
తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన ‘జన నాయకుడు’ (తమిళంలో జన నయగన్) తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే…
సామజవరగమన సినిమా తర్వాత శ్రీ విష్ణు, దర్శకుడు రామ్ అబ్బరాజు మరోసారి చేతులు కలిపారు. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి…
'టాక్సిస్' (Toxic) సినిమాపై కొన్ని రోజులుగా నడుస్తున్న ట్రోలింగ్ కు సింపుల్ గా, సుత్తిలేకుండా కౌంటర్ ఇచ్చారు నిర్మాత వెంకట్…
పరిశ్రమలో ప్రతి ఒక్కరికి చేదు అనుభవాలు, జ్ఞపకాలు ఉంటాయి. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి కూడా…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…