ఒకసారి తప్పు మాట్లాడితే పోనిలే ఎదో నోరు జారాడులే అని ఊరుకుంటారు. రెండో సారి కూడా మాట తూలితే కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి అని సన్నిహితులు చెప్తారు. మూడోసారి మాట్లాడితే కోపం తెచ్చుకుంటారు. నాలుగోసారి చేస్తే చిరాకు పడుతారు. అదే రిపీట్ చేస్తే ఎదురు తిడుతారు, గట్టిగా కౌంటర్ ఇస్తారు, ట్రోల్ చేస్తారు. ఇంకా చాలా చేస్తారు. అదే జరిగింది రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) విషయంలో.
ఇటీవలే పద్మశ్రీ బిరుదు కూడా తెచ్చుకున్న రాజేంద్రప్రసాద్ మరోసారి (ఎన్నోసారి అని అడగొద్దు) మాట తూలి క్షమాపణ చెప్పారు. తమిళనాట గగ్గోలు పెట్టడంతో ఎంజీఆర్ (MGR) విషయంలో తప్పుగా మాట్లాడాను క్షమించండి అని తమిళ్ లోనే వేసుకోవాల్సి వచ్చింది రాజేంద్రుడి.
నటుడు కాంతారావు గురించి గొప్పగా చెప్పే ప్రయత్నంలో కాంతారావు చేసిన జానపద పాత్రలు చూసి ఎంజీఆర్ “ఉచ్చ పోసుకునేవాడు” అని మాట్లాడి విమర్శల పాలు అయ్యారు రాజేంద్రుడు. దాంతో తాజాగా క్షమాపణ కోరుతూ ఒక వీడియో రిలీజ్ చేశారు.
“ఎంజీఆర్ తమిళ సినిమాకు దేవుడు. తమిళ జనాలు ఆయన్ని ఎలా చూస్తారో నాకు తెలుసు. ఎంజీఆర్ మీద నాకు అపారమైన గౌరవం ఉంది. పొరపాటున మాట తూలాను,” అని క్షమాపణలు చెప్పారు.
ఇలా సారీ చెప్పడం రాజేంద్రప్రసాద్ కి మొదటిసారి కాదు. అనేకసార్లు స్తేజ్ పై “ఫ్లో”లో మాట్లాడెయ్యడం, తర్వాత సానుభూతి కోసం ఎదో “కవరింగ్” మాటలు చెప్పడం అలవాటు అయిపొయింది ఈ సీనియర్ నటుడికి. పదే పదే అదే పద్దతా?
రవితేజ నటించిన "ఇరుముడి" (Irumudi) చిత్రం వాయిదా పడనుంది అని ఇటీవల రూమర్లు వచ్చాయి. కానీ ఈ సినిమా ఆగస్టు…
సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో ప్రభాస్ (Prabhas) హీరోగా రూపొందుతున్న భారీ చిత్రం 'స్పిరిట్' (Spirit)…
తమిళనాట రాజకీయాల్లో ఒక బ్రేక్ కోసం బీజేపీ చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. రజినీకాంత్ ని రంగంలోకి దింపి, ఆయనతో పార్టీ…
అక్కినేని అఖిల్ (Akhil Akkineni), జైనబ్ (Zainab Ravdjee) 2025 జూన్‌లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి జరిగిన వెంటనే ఈ…
రవితేజ (Ravi Teja) కథానాయకుడిగా నటిస్తున్న ‘ఇరుముడి’ (Irumudi) చిత్రంపై ఇటీవల సోషల్ మీడియాలో నెలకొన్న సందేహాలకు తెరపడింది. బుక్‌మైషోలో…
ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘దేవర’ నిజమైన బ్లాక్‌బస్టర్ అని నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఏరియాల్లో…