హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బెడ్ రెస్ట్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. జిమ్ లో భారీ బరువులు మోసే ప్రయత్నం చేసిన రకుల్ తీవ్రంగా గాయపడింది. ఆమె వెన్నెముకకు గాయమైంది.
దీంతో వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం ఆమె బెడ్ కే పరిమితమైంది. అయినప్పటికీ ఆమె ఓ పండగలో పాల్గొంది. ఉత్తరాదిన భార్యలంతా ఘనంగా జరుపుకునే కర్వా చౌత్ పండగను రకుల్ కూడా సెలబ్రేట్ చేసుకుంది.
పెళ్లయిన తర్వాత తొలిసారి వచ్చిన ఈ వేడుకను మిస్ అవ్వడం రకుల్ కు ఇష్టం లేదు. అందుకే నడుముకు బెల్ట్ కట్టుకొని మరీ కర్వాచౌత్ లో పాల్గొంది. తన భర్త పేరును చేతిపై మెహందీగా వేసుకొని, ఆ తర్వాత జాకీతో కలిసి సంప్రదాయ బద్ధంగా ఈ వేడుకలో పాల్గొంది.
మరికొన్ని రోజుల్లో ఆమె పూర్తిస్థాయిలో కోలుకుంటుంది. ఇన్నాళ్లూ తన బాడీ కంటే మైండ్ చాలా బలమైందని నమ్మానని, కానీ కొన్ని సందర్భాల్లో శరీరం చెప్పింది కూడా వినాలని రకుల్ చెప్పుకొచ్చింది. గాయంతో బెడ్ కు పరిమితమైన తనకు జీవితం స్తంభించిన ఫీలింగ్ వచ్చిందని, చాలా విషయాలు తెలిసొచ్చాయని, జ్ఞానోదయం అయిందని అంటోంది.
హీరో, దర్శకుడు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఇలా అనేక విధాలుగా పాపులర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence). "ముని", కాంచన సినిమాల…
మహేష్ బాబు,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'గుంటూరు కారం' (Guntur Kaaram) సినిమా గురించి ఇప్పుడు ప్రత్యేకంగా…
పూజ హెగ్డే (Pooja Hegde)కి ఇప్పుడు లక్ తిరిగినట్టు కనిపిస్తోంది. ఆమెకి హిట్స్ లేవు కానీ వరుసగా అవకాశాలు వస్తూనే…
ఈ రోజు అల్లరి నరేష్ (Allari Naresh) పుట్టిన రోజు. దాంతో, నరేష్ కొత్త సినిమా "రంభ ఊర్వశి మేనక"…
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నాగబంధం'(Nagabandham)లో నభా నటేష్ (Nabha Natesh) మెయిన్ హీరోయిన్ గా…
సినిమా అవకాశాలు తగ్గినా, తాను అనుకున్న తరహా పాత్రలు రాకపోయినా పర్వాలేదని, తనకంటూ ఒక సంతోషకరమైన వ్యక్తిగత జీవితం ఉందని…