పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో నటిస్తే వచ్చే కిక్ వేరు, అది నెక్స్ట్ లెవల్లో ఉంటుంది అని అంటున్నారు రామ్. వరంగల్ లో ఈ రోజు “డబుల్ ఇస్మార్ట్” ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.
“హాయ్ వరంగల్. ఇస్మార్ట్ శంకర్ ప్రీరిలీజ్ ఈవెంట్ కి ఇక్కడికి వచ్చాం, మళ్ళీ డబుల్ ఇస్మార్ట్ ఈవెంట్ కి ఇక్కడి రావడం చాలా హ్యాపీగా వుంది. పూరి గారితో ఎనర్జీ షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా వుంది. ఆయనతో పని చేసినప్పుడు వచ్చే కిక్ నెక్స్ట్ లెవల్ లో వుంటుంది. పూరిగారు మోస్ట్ ఇన్స్పైరింగ్ డైరెక్టర్స్ అఫ్ తెలుగు సినిమా. రైటర్, డైరెక్టర్ కావాలని వచ్చిన వారు పూరి గారి చూసి స్ఫూర్తి పొందే వస్తారు. పూరి గారు గన్ లాంటి వారు. పేల్చే గన్ బావుంటే బుల్లెట్ ఎంతఫోర్స్ గా అయినా వెళ్తుంది,” అని పూరి గురించి చెప్పారు రామ్.
“మనికి నచ్చిందే చేయాలి. పక్కోడి గురించి పట్టించుకుంటే పనులు జరగవు. ఆగస్ట్ 15న కలుద్దాం. లవ్ యూ ఆల్,” అన్నారు రామ్.
పూరి జగన్నాథ్ కూడా రామ్ ని పొగిడారు. “రామ్ ని సెట్స్ లో చూసిననప్పుడు తనలో కసి కనిపిస్తుంటుంది, అది నన్ను చాలా ఎక్సయిట్ చేస్తుంది. తన క్యారెక్టర్, హెయిర్ స్టయిల్, నడక, స్లాంగ్.. ఇవన్నీ తను పెర్ఫార్మ్ చేయడం వలనే అవుతుంది. తను వెరీ గుడ్ యాక్టర్, డ్యాన్సర్. రామ్ పోతినేని లేకపోతే ఇస్మార్ట్ శంకర్ లేడు. థాంక్ యూ రామ్. సంజు బాబాకి నేను పెద్ద ఫ్యాన్ ని. 150 సినిమాల హీరో ఆయన. ఆయన ఈ సినిమాలో చేయడం కొత్త కలర్ తీసుకొచ్చింది. కావ్య చాలా బాగా పెర్ఫారం చేసింది. రామ్ పక్కన అద్భుతంగా డ్యాన్స్ చేసింది. తెలుగులో నేర్చుకొని డబ్బింగ్ చెప్పింది. అలీ గారి గురించి ఎక్కువ చెప్పను. ఇందులో అలీ గారి అలీగారి ట్రాక్ ని చాలా ఎంజాయ్ చేస్తారు,” అని తెలిపారు పూరి.
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…
హీరో నుంచి ముఖ్యమంత్రి కావడం అనేది అసాధారణ విజయం అని అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). కలలాంటి…
ఒక్క మే నెల తప్ప మార్చి నుంచి జూన్ వరకు వచ్చే ఏడాది సమ్మర్ (Summer 2027)లో ప్రతి నెలా…
టాలీవుడ్ నుంచి మరో మహిళా దర్శకురాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 'సింగ్…
తమిళ స్టార్ విజయ్ చివరి చిత్రంగా తెరకెక్కిన 'జన నాయకుడు' (తమిళంలో 'జన నాయగన్') ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు…
హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త సస్పెన్స్…