న్యూస్

Samantha: ఇంకా పని అవలేదంట

సమంత (Samantha) నటించిన “మా ఇంటి బంగారం” (Maa Inti Bangaram) మే 15న విడుదల కానుంది. ఈ సినిమా డేట్ ని చాలా రోజుల క్రితమే ప్రకటించారు. ఇది సమంత కి రెండో ఇన్నింగ్స్ కి దారి వేసే సినిమా.

ఐతే, ఈ సినిమాని మే 15 బదులు మే1 న రిలీజ్ చెయ్యాలని భావించారు. ఎందుకంటే “పెద్ది” సినిమా ఏప్రిల్ 30న విడుదల కావడం లేదు. ఆ స్లాట్ ని లాగేసుకుంటే మంచి ఓపెనింగ్ వస్తుంది అని సమంత భావించింది. ఐతే, ఆ లోపు అన్ని పనులు అయ్యేలా లేవంట. ఎంత తొందరపడినా ఆ లోపు పోస్ట్ ప్రొడక్షన్ పని మొత్తం పూర్తి కాదు. దాంతో, మే 1న విడుదల చెయ్యాలనే ఆలోచన విరమించుకున్నారు.

ఇంతకుముందు ప్రకటించినట్లే “మా ఇంటి బంగారం” మే 15న విడుదల అవుతుంది. ఈ సినిమాలో ఆమె ఒక ఇంటి సాధారణ కోడలుగా కనిపిస్తూనే యాక్షన్ రోల్ లో దర్శనమిస్తుంది. సమంతతో ఇంతకుముందు “ఓ బేబీ” వంటి హిట్ చిత్రాన్ని తీసిన దర్శకురాలు నందిని రెడ్డి ఈ సినిమాకి డైరెక్టర్.

2023లో విజయ్ దేవరకొండ సరసన “ఖుషి” సినిమాలో సమంత నటించింది. ఆ సినిమా తర్వాత మళ్ళీ ఆమె హీరోయిన్ గా కనిపిస్తున్న చిత్రం ఇదే.

TeluguCinema

Recent Posts

నాగబంధంలో స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను: Nabha Natesh

విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నాగబంధం'(Nagabandham)లో నభా నటేష్ (Nabha Natesh) మెయిన్ హీరోయిన్ గా…

15 hours ago

Sonakshi Sinha: అవకాశాలు తగ్గినా పర్లేదు!

సినిమా అవకాశాలు తగ్గినా, తాను అనుకున్న తరహా పాత్రలు రాకపోయినా పర్వాలేదని, తనకంటూ ఒక సంతోషకరమైన వ్యక్తిగత జీవితం ఉందని…

19 hours ago

Varanasi: ఓవర్సీస్ రేట్లు మరీ ఓవర్ గా ఉన్నాయట

రాజమౌళి (Rajamouli) సినిమా అంటే పాత రికార్డులు బద్దలవ్వాలి. కొత్త రికార్డులు స్టార్ట్ అవ్వాల్సిందే. వచ్చే ఏడాది విడుదల కానున్న…

20 hours ago

Peddi: మిగతా అన్ని భాషల్లోనూ అట్టర్ ఫ్లాప్

రామ్ చరణ్ నటించిన "పెద్ది" (Peddi) సినిమా జూన్ 4న విడుదలైంది. 25 రోజుల తర్వాత ఈ సినిమా పూర్తి…

21 hours ago

Ram Pothineni: ఈ రోజు నుంచి మొదలుపెట్టాడు

రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా మంచి పొజిషన్ లో ఉన్నాడు. పాపులారిటీ ఉంది. యూత్ లో క్రేజ్ ఉంది.…

21 hours ago

Sithara: జులై నుంచి అక్టోబర్, వరుసగా నాలుగు చిత్రాలు

వరుసగా సినిమాలు నిర్మిస్తోన్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ (Sithara Entertainments) వచ్చే నెల నుంచి నెలకో సినిమా విడుదల…

1 day ago