Categories: న్యూస్

జోరు, బేజారు… రెండూ స్పీడ్ గానే!

స్పీడ్ గా స్టార్డం తెచ్చుకొని ఎడాపెడా సినిమాలు చెయ్యడం… అంతే స్పీడ్ గా సినిమాలు తగ్గిపోయి బేజారు అవడం ఇటీవల ఇద్దరి హీరోయిన్ల విషయంలో జరిగింది.

శ్రీలీల

రాఘవేంద్రరావు తీసిన “పెళ్లి సందD” చిత్రంతో పరిచయమైన అచ్చ తెలుగు సుందరి శ్రీలీల. బెంగుళూరులో పుట్టి పెరిగిన శ్రీలీల డ్యాన్స్ అదరగొడుతుంది. అందుకే,  “పెళ్లి సందD”లో నటించిన హీరో రోషన్ కెరీర్ ఎదగలేదు కానీ ఈ భామ రెండేళ్లలోనే టాప్ హీరోయిన్ అయిపోయింది.

ఆ తర్వాత వచ్చిన “ధమాకా” హిట్ కావడంతో  పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ పోతినేని, నితిన్ ఇలా పెద్ద, మిడిల్ రేంజ్ హీరోల సరసన సినిమాలు వచ్చి పడ్డాయి. “ధమాకా” 2022 డిసెంబర్లో విడుదలైతే 2024 జనవరి అంటే 13 నెలల్లో ఐదు సినిమాలు విడుదల చెయ్యగలిగింది. “స్కంద”, “భగవంత్ కేసరి”, “ఆదికేశవ”, “ఎక్స్ట్రా ఆర్డినరీ మేన్”, “గుంటూరు కారం” సినిమాలు విడుదల అయ్యాయి. అందులో బాలయ్యకి కూతురిలాంటి పాత్ర పోషించిన “భగవంత్ కేసరి” ఒక్కటే విజయం సాధించింది. “గుంటూరు కారం” మోస్తరుగానే ఆడింది. మిగతావన్నీ ఫ్లాపులే.

ఇప్పుడు కొత్తగా ఇంకా సినిమాలు సైన్ చెయ్యలేదు. ఇంతకుముందు ఒప్పుకున్నా “ఉస్తాద్ భగత్ సింగ్” సినిమా మాత్రమే ఉంది లైన్లో.

మొన్నటివరకు సగం సినిమా ఇండస్ట్రీ ఆమె గుప్పిట్లో ఉండింది. ఇప్పుడు మొత్తం పడిపోయింది.

కృతి శెట్టి

“ఉప్పెన” సినిమాతో యమా క్రేజ్ పొందింది. ఆ వెంటనే రామ్, నితిన్, నాని, నాగ చైతన్య వంటి యువ హీరోల సరసన ఆఫర్లు పొందింది.

నానితో నటించిన “శ్యామ్ సింగరాయ్” విజయం సాధించింది. అలాగే నాగచైతన్యతో నటించిన “బంగార్రాజు” కూడా ఆడింది. కానీ ఆ తర్వాత రామ్ తో చేసిన “వారియర్”, నితిన్ తో నటించిన “మాచర్ల నియోజకవర్గం”, చైతన్యతో రెండో సారి నటించిన “కస్టడీ”, అలాగే  సుధీర్ బాబు సరసన “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” వంటి చిత్రాలు బోల్తా కొట్టాయి. దాంతో ఆమె కెరీర్ రివర్స్ గేర్ లో పడింది.

ప్రస్తుతం ఆమె చేతిలో శర్వానంద్ హీరోగా రూపొందిన “మనమే” అనే మూవీ ఉంది. ఇది హిట్ అయితేనే ఆమెకి తెలుగులో మరో ఆఫర్ వస్తుంది.

Admin

Recent Posts

నాగబంధంలో స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను: Nabha Natesh

విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నాగబంధం'(Nagabandham)లో నభా నటేష్ (Nabha Natesh) మెయిన్ హీరోయిన్ గా…

10 hours ago

Sonakshi Sinha: అవకాశాలు తగ్గినా పర్లేదు!

సినిమా అవకాశాలు తగ్గినా, తాను అనుకున్న తరహా పాత్రలు రాకపోయినా పర్వాలేదని, తనకంటూ ఒక సంతోషకరమైన వ్యక్తిగత జీవితం ఉందని…

14 hours ago

Varanasi: ఓవర్సీస్ రేట్లు మరీ ఓవర్ గా ఉన్నాయట

రాజమౌళి (Rajamouli) సినిమా అంటే పాత రికార్డులు బద్దలవ్వాలి. కొత్త రికార్డులు స్టార్ట్ అవ్వాల్సిందే. వచ్చే ఏడాది విడుదల కానున్న…

15 hours ago

Peddi: మిగతా అన్ని భాషల్లోనూ అట్టర్ ఫ్లాప్

రామ్ చరణ్ నటించిన "పెద్ది" (Peddi) సినిమా జూన్ 4న విడుదలైంది. 25 రోజుల తర్వాత ఈ సినిమా పూర్తి…

16 hours ago

Ram Pothineni: ఈ రోజు నుంచి మొదలుపెట్టాడు

రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా మంచి పొజిషన్ లో ఉన్నాడు. పాపులారిటీ ఉంది. యూత్ లో క్రేజ్ ఉంది.…

16 hours ago

Sithara: జులై నుంచి అక్టోబర్, వరుసగా నాలుగు చిత్రాలు

వరుసగా సినిమాలు నిర్మిస్తోన్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ (Sithara Entertainments) వచ్చే నెల నుంచి నెలకో సినిమా విడుదల…

1 day ago