సినిమాపై నమ్మకంతో భారీ రన్ టైమ్ తో రిలీజ్ చేస్తుంటారు. సక్సెస్ అయితే ఓకే, ఫెయిల్ అయితే మాత్రం ఉన్నఫలంగా కోత పెడతారు. సినిమా నిడివి తగ్గించామని, ఇప్పుడు థియేటర్లకు రావాలని కోరుతుంటారు మేకర్స్. దీని వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని తెలిసినప్పటికీ, చివరాఖరి ప్రయత్నంగా కత్తెరకు పనిచెబుతుంటారు.
అయితే హిట్ అయిన సినిమాకు నిడివి తగ్గించిన దాఖలాలు మాత్రం చాలా అరుదు. ఇది అలాంటిదే. కార్తి, అరవింద్ స్వామి హీరోలుగా నటించిన సినిమా “సత్యం సుందరం'”. 96 ఫేమ్ ప్రేమ్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా తాజాగా థియేటర్లలోకి వచ్చింది. ప్రేక్షకుల హృదయాలకు హత్తుకుంది.
ఈ మధ్య కాలంలో ఇంత మంచి సినిమా రాలేదంటున్నారు చూసిన ప్రేక్షకులు. అలా హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ సినిమా నుంచి 15 నిమిషాలు కట్ చేశారు. ఈ సినిమా 2 గంటల 57 నిమిషాల నిడివితో తెరకెక్కింది. సినిమా బాగున్నప్పటికీ, మరింత మంచి అనుభూతిని ఇచ్చేందుకు సెకండాఫ్ నుంచి పావు గంట సినిమాను కట్ చేశారు.
తెలుగు ప్రేక్షకుల్ని కూడా ఇది ఆకట్టుకుంది. అయితే దేవర హవా ముందు సత్యం సుందరం చిన్నబోయింది. మౌత్ టాక్ బాగున్నప్పటికీ మంచి థియేటర్లు దొరక్క వసూళ్లలో ఇది వెనకబడింది.
ఒక్క మే నెల తప్ప మార్చి నుంచి జూన్ వరకు వచ్చే ఏడాది సమ్మర్ (Summer 2027)లో ప్రతి నెలా…
టాలీవుడ్ నుంచి మరో మహిళా దర్శకురాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 'సింగ్…
తమిళ స్టార్ విజయ్ చివరి చిత్రంగా తెరకెక్కిన 'జన నాయకుడు' (తమిళంలో 'జన నాయగన్') ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు…
హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త సస్పెన్స్…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో హడావిడిగా విడుదల తేదీ ప్రకటించి కనీసం రెండు, మూడు సార్లు విడుదల తేదీని వాయిదా వేసే…
రామ్ చరణ్ పై తనకున్న అభిమానాన్ని ఇప్పటికే చాటుకున్నాడు అఖిల్ (Akhil Akkineni). తాజాగా ఎన్టీఆర్ తో తన అనుబంధాన్ని…