న్యూస్

Spirit: ప్రభాస్ పోలీస్ డ్రామా షురూ!

ప్రభాస్ (Prabhas), సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కాంబినేషన్‌లో “స్పిరిట్” (Spirit) సినిమా రూపొందుతోంది. ఈ మండుటెండల్లో కూడా సినిమా షూటింగ్ జరుగుతోంది. ప్రభాస్ పైనే కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు దర్శకుడు వంగా.

తాజాగా ఈ సినిమాకి సంబంధించిన కొన్ని విషయాలు బయటికి వచ్చాయి. సందీప్ వంగా మరోసారి ఇంటెన్స్ ఎమోషనల్ సీన్లను తనదైన శైలిలో ప్రభాస్ పై చిత్రీకరిస్తున్నారట. ప్రభాస్ ఇప్పటివరకు పోలీసు అధికారిగా నటించలేదు. ఈ సినిమాలో ఆ పాత్ర పోషిస్తున్నారు. తాజాగా పోలీస్ స్టేషన్‌ లో ప్రభాస్ విలన్ ని ఎదుర్కొనే సీన్లను తీస్తున్నారట.

విలన్ గా నటిస్తున్న వివేక్ ఒబెరాయ్, ప్రభాస్ మధ్య మాటల యుద్ధం చాలా గమ్మత్తుగా ఉంటుందట. హీరో, విలన్ మధ్య ఇగో ఇష్యుని వంగా కొత్త పద్దతిలో థ్రిల్లింగ్ గా తీస్తున్నారట. ఈ పోలీస్ స్టేషన్ ఎపిసోడ్ సినిమాకే హైలెట్ అవుతుందట.

స్పిరిట్ అనే ఈ క్రైం డ్రామాలో హీరోయిన్ గా త్రిప్తి డిమ్రి నటిస్తోంది. ఈ ఏడాది చివర్లోపు షూటింగ్ మొత్తం పూర్తి చేసి 2027 మార్చి 5న గ్రాండ్ రిలీజ్ చెయ్యాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ డేట్ కి ఈ సినిమా వస్తుందా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేం.

TeluguCinema

Recent Posts

Lenin: హీరోకి, హీరోయిన్ కి ఒకేసారి పరీక్ష

ఒకే సినిమాతో హీరోకి, హీరోయిన్ కి విషమ పరీక్ష ఎదురుకావడం అరుదు. "లెనిన్" (Lenin) సినిమా విషయంలో అదే జరుగుతోంది.…

7 minutes ago

Mumait Khan బుర్రలో టైటానియం

ఒకప్పుడు తన స్పెషల్ సాంగ్స్, ఎనర్జిటిక్ డ్యాన్స్‌లతో కుర్రకారును ఉర్రూతలూగించిన ముమైత్ ఖాన్ (Mumait Khan), ఒకప్పుడు తన జీవితంలోని…

58 minutes ago

సింగీతంతో ప్రయాణం అదృష్టం: Nag Ashwin

లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు (Singeetam Srinivasa Rao) 94 ఏళ్ల వయసులో తెరకెక్కించిన చిత్రం "సింగ్ గీతం"…

19 hours ago

సుతారంగా క్లాస్ పీకిన Anasuya Bharadwaj

పెద్ది సినిమాలో జాన్వి కపూర్ పాత్ర చిత్రీకరణపై సోషల్ మీడియాలో రకరకాల వ్యాఖ్యానాలు కనిపిస్తున్న సంగతి తెలిసిందే. వీటిని నేరుగా…

22 hours ago

పోలీసుగా మారనున్నSai Pallavi

హీరోయిన్ సాయి పల్లవి (Sai Pallavi) మరో డిఫరెంట్ రోల్ లోకి షిఫ్ట్ అయినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఆమె పోలీస్…

1 day ago

Dulquer Salmaan: తెలుగు షూటింగ్ ల జోరు

దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) గత కొన్నేళ్లుగా కేరళలో కన్నా హైదరాబాద్ లో ఎక్కువగా ఉంటున్నాడు. తాను నటించే మలయాళ…

1 day ago