
ప్రభాస్ (Prabhas), సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కాంబినేషన్‌లో “స్పిరిట్” (Spirit) సినిమా రూపొందుతోంది. ఈ మండుటెండల్లో కూడా సినిమా షూటింగ్ జరుగుతోంది. ప్రభాస్ పైనే కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు దర్శకుడు వంగా.
తాజాగా ఈ సినిమాకి సంబంధించిన కొన్ని విషయాలు బయటికి వచ్చాయి. సందీప్ వంగా మరోసారి ఇంటెన్స్ ఎమోషనల్ సీన్లను తనదైన శైలిలో ప్రభాస్ పై చిత్రీకరిస్తున్నారట. ప్రభాస్ ఇప్పటివరకు పోలీసు అధికారిగా నటించలేదు. ఈ సినిమాలో ఆ పాత్ర పోషిస్తున్నారు. తాజాగా పోలీస్ స్టేషన్ లో ప్రభాస్ విలన్ ని ఎదుర్కొనే సీన్లను తీస్తున్నారట.
విలన్ గా నటిస్తున్న వివేక్ ఒబెరాయ్, ప్రభాస్ మధ్య మాటల యుద్ధం చాలా గమ్మత్తుగా ఉంటుందట. హీరో, విలన్ మధ్య ఇగో ఇష్యుని వంగా కొత్త పద్దతిలో థ్రిల్లింగ్ గా తీస్తున్నారట. ఈ పోలీస్ స్టేషన్ ఎపిసోడ్ సినిమాకే హైలెట్ అవుతుందట.
స్పిరిట్ అనే ఈ క్రైం డ్రామాలో హీరోయిన్ గా త్రిప్తి డిమ్రి నటిస్తోంది. ఈ ఏడాది చివర్లోపు షూటింగ్ మొత్తం పూర్తి చేసి 2027 మార్చి 5న గ్రాండ్ రిలీజ్ చెయ్యాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ డేట్ కి ఈ సినిమా వస్తుందా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేం.
