
హీరోలతో పోలిస్తే హీరోయిన్లకు బరువు బాధ్యతలు తక్కువ. స్క్రీన్ టైమ్ కూడా తక్కువ. కానీ కొంతమంది హీరోయిన్లు అలా ఊరుకోరు. తమ పాత్ర కోసం మరింతగా కష్టపడతారు. యూనిట్ లో సభ్యుల్ని కూడా కష్టపెడుతుంటారు. జాన్వి కపూర్ (Janhvi Kapoor) ఇదే టైపు.
‘పెద్ది’ (Peddi) సినిమాతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంది జాన్వి. తన పోర్షన్ షూటింగ్ పూర్తయినప్పటికీ ఆ సినిమాను, సెట్స్ ను వదిలి ఉండలేకపోయిందట. అందుకే పని లేకపోయినా ఊరికే బుచ్చిబాబుకు ఫోన్ చేసేదంట. దాదాపు ప్రతి రోజూ బుచ్చిబాబుకు ఫోన్ చేసి, సినిమాకు సంబంధించి ఏదో ఒకటి మాట్లాడేదంట.
తనలో నటిని బుచ్చిబాబు మరింత వెలికితీశాడని చెబుతోంది జాన్వి. ఇక బుచ్చిబాబు, చరణ్ గురించి మాట్లాడుతూ, చరణ్ తో పని చేయడం తనకు లైఫ్ టైమ్ మెమొరీ అని చెప్పుకొచ్చింది. ముంబయిలో ‘పెద్ది’ ట్రయిలర్ లాంచ్ సందర్భంగా ఈ విషయాలన్నీ బయటపెట్టింది జాన్వి కపూర్.
CHECK: PHOTOS of Janhvi Kapoor at Peddi trailer launch in Mumbai
అటు బుచ్చిబాబు, చరణ్ కూడా జాన్వి కపూర్ లాంటి హీరోయిన్‌ను చూడలేదన్నారు. పాత్ర కోసం ఇంతలా కష్టపడే నటిని తాము ఎక్కడా చూడలేదని, వారం ముందు నుంచే సీన్ పేపర్ పట్టుకొని ప్రాక్టీస్ చేస్తుందని వెల్లడించారు. శ్రీదేవి కూతురా మజాకా..!
