
కొందరు హీరోలు ఒకే సంస్థలో ఎక్కువగా సినిమాలు చేస్తూ ఉంటారు. హీరోయిన్లు మాత్రం ఒకే బ్యానర్ కి పరిమితం అవ్వరు. ఏ సంస్థలో సినిమా అఫర్ వస్తే ఆ సంస్థకి చేస్తూ ఉంటారు. ఎక్కువ రెమ్యునరేషన్ పొందే విధంగా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. కానీ మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) మాత్రం భిన్నంగా వెళ్తోంది.
ఆమె తాజాగా తెలుగులో ఒక సినిమాలో నటిస్తోంది. అలాగే ఒక వెబ్ సిరీస్ చేస్తోంది. తాజాగా మరో సినిమా ఒప్పుకొంది. ఈ కొత్తగా ఒప్పుకున్న చిత్రం సితార తీస్తున్న సినిమా.
NEW PHOTOS: Meenakshi Chaudhary: Beauty in Simplicity
మీనాక్షి ఇప్పటివరకు నటించిన సినిమాల్లో ఎక్కువ చిత్రాలు సితార ఎంటర్టైన్ మెంట్స్ నిర్మించినవే ఎక్కువ. గుంటూరు కారం (సితార మాతృ సంస్థ హారిక హాసిని నిర్మించింది), లక్కీ భాస్కర్, అనగనగా ఒక రాజు… ఇవన్నీ ఆ బ్యానర్ చిత్రాలే. తాజాగా కార్తీ హీరోగా దర్శకుడు కళ్యాణ్ శంకర్ (మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ చిత్రాల దర్శకుడు) ఈ సంస్థ తీస్తున్న కొత్త చిత్రంలో కూడా మీనాక్షి చౌదరి హీరోయిన్. అంటే ఈ బ్యానర్ లో ఆమెకి ఇది నాలుగో చిత్రం.
గతంలో పూజ హెగ్డే హారిక హాసిని బ్యానర్ లో వరుసగా రెండు చిత్రాలు చేసింది. ఆమె కన్నా మీనాక్షి రెండు ఆకులే ఎక్కువ చదివింది. అదేనండి, రెండు సినిమాలు ఎక్కువే చేస్తోంది.
