న్యూస్

SRK: అట్లీతో స్నేహం అలాంటిది

షారుక్ ఖాన్ (SRK) ఒక తమిళ దర్శకుడితో ఎక్కువ స్నేహబంధం క్రియేట్ చేసుకున్నారు. ఆ దర్శకుడు ఎవరో కాదు అట్లీ (Atlee). తనకు “జవాన్” వంటి హిట్ ఇచ్చిన ఆ దర్శకుడి సినిమా కోసం ట్వీట్లు కూడా వేస్తున్నారు షారుక్ ఖాన్. అలా ఉంది వారి బంధం.

నిన్న అల్లు అర్జున్ (Allu Arjun) పుట్టిన రోజు. బన్నీ బర్త్ డే నాడు “రాకా” (Raaka) అనే సినిమా మొదటి లుక్ విడుదల చేశారు. అల్లు అర్జున్ పోస్టర్ ని మాత్రమే నిన్న విడుదల చేశారు. ఐతే, ఈ సినిమా పోస్టర్ బాగుంది అని, ఇది పక్కా మాస్ అని పొగుడుతూ షారుక్ ట్వీట్ చేశారు. పనిలోపనిగా ఆలు అర్జున్ కి బర్త్ డే విషెస్ చెప్పారు.

ALSO READ: Raaka: అల్లు అర్జున్ లుక్ “ఐ”లా ఉందా!

సాధారణంగా అల్లు అర్జున్ కి ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు షారుక్ చెప్పడు. అదీ కూడా సోషల్ మీడియా ద్వారా. ఈ సారి ప్రత్యేకంగా చెప్పడంతో అది కేవలం అట్లీ సినిమా కోసమే అని అంటున్నారు.

ఐతే అల్లు అర్జున్ వెంటనే స్పందించి షారుక్ విషెస్ అన్నిటికన్నా స్పెషల్ అని రిప్లై ఇచ్చాడు. షారుక్ ఖాన్ ఇంతకుముందు అల్లు అర్జున్ “పుష్ప 2” భారీ హిట్ కొట్టినప్పుడు కూడా పోస్ట్ చేశాడు. ఐతే బర్త్ డేకి ప్రత్యేకంగా ట్వీట్ చెయ్యడం ఇదే మొదటిసారి.

అల్లు అర్జున్ “పుష్ప 2” సినిమాతో హిందీ మార్కెట్ ని కైవసం చేసుకున్నాడు.

TeluguCinema

Recent Posts

నా ఫిట్ నెస్ సీక్రెట్ అదే: Kajal Aggarwal

పెళ్లయి, బాబుకు తల్లి అయినప్పటికీ, ఇప్పటికీ సన్నజాజి తీగలా మెరిసిపోతోంది కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal). కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం…

7 hours ago

Bhagyashri Borse: ఒక్క విజయం 2 కోట్ల భాగ్యం

భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse)కి ఐదు సినిమాల తర్వాత మొదటి విజయం దక్కింది. ఒక్క సినిమా హిట్ కాకపోయినా అనేక…

16 hours ago

Prince Cecil: వైవాహిక బంధంలోకి మరో నటుడు

సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఒక్కొక్కరుగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. బ్రహ్మచారి జీవితానికి గుడ్ బై చెప్పేస్తున్నారు. ఇదే బాటలో తాజాగా…

16 hours ago

Nabha Natesh: రెండు సినిమాలపై ఆశలు, ఒకటి పోయింది

నభా నటేష్ (Nabha Natesh) ఈ ఏడాది రెండు భారీ సినిమాలపై ఆశలు పెట్టుకొంది ఒకటి నాగబంధం (Nagabandham), మరోటి…

1 day ago

Sri Gouri Priya: తెలుగు భామకి తెలుగులో కెరీర్ ఊపు వచ్చేనా

శ్రీ గౌరీ ప్రియ (Sri Gouri Priya) అచ్చ తెలుగు అమ్మాయి. ఇప్పటికే తెలుగులో 'మ్యాడ్' చిత్రంలో నటించింది. తమిళంలో…

1 day ago

Rashmika Mandannaకి వీరితో జోడి కుదిరేనా?

తెలుగులో పాన్ ఇండియా స్థాయిలో పాపులారిటీ ఉన్న భామ… రష్మిక మందాన (Rashmika Mandanna) మాత్రమే. బాలీవుడ్ లో  'యానిమల్',…

1 day ago