సూర్య (Suriya) లేటెస్ట్ మూవీ ‘కరుప్పు’ (Karuppu. తెలుగులో దీన్ని ‘వీరభద్రుడు’ IVeera Bhadrudu) పేరిట రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రచారాన్ని మళ్లీ మొదలుపెట్టారు. మే 14న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ విడుదల చేస్తోంది. అక్కినేని నాగార్జున నేతృత్వంలో ఈ సంస్థకు ఉన్న డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్, ‘వీరభద్రుడు’కు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. నాణ్యమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించడంలో అన్నపూర్ణ స్టూడియోస్ ఎప్పుడూ ముందుంటుంది. ఇలాంటి సంస్థ నుంచి ‘వీరభద్రుడు’రిలీజ్ అవుతుండడంతో తెలుగులో ఈ ప్రాజెక్టుకు ఇంకాస్త వెయిట్ పెరిగింది.
తెలుగులో ప్రస్తుతం డ్రై సీజన్ నడుస్తోంది. థియేటర్లలో గట్టిగా నిలబడిన సినిమా ఒక్కటి కూడా లేదు. ఇలాంటి టైమ్ లో వస్తున్న ‘వీరభద్రుడు’, ఈ అడ్వాంటేజ్ ను క్యాష్ చేసుకుంటాడో లేదో చూడాలి. అటు ప్రచారం పెద్దగా లేకపోవడంతో, సినిమాపై బజ్ తక్కువగా ఉంది. చాలామందికి ఈ సినిమా వచ్చే వారం రిలీజ్ అవుతుందనే విషయం కూడా తెలియదు.
దీనికితోడు సూర్యకు తెలుగులో ఉన్న ట్రాక్ రికార్డ్ కూడా అంతంతమాత్రం. ఇవన్నీ దాటుకొని ‘వీరభద్రుడు’ విజయం సాధించాల్సి ఉంది. త్రిష హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు ఆర్జే బాలాజీ దర్శకుడు. సయీ అభ్యంకర్ సంగీత దర్శకుడు.
హీరోయిన్ నభా నటేష్ (Nabha Natesh) తెగ హడావిడి చేస్తోంది. సినిమాకి ఎంత ప్రచారం చెయ్యాలన్నా చేస్తాను అన్నట్లు "నాగబంధం"…
ఈ దసరా పండక్కి (Dasara 2026) రెండు పెద్ద సినిమాలు పోటీ పడేలా ఉన్నాయి. ఒక పెద్ద సినిమాకి అధికారికంగా…
మాళవిక మోహనన్ అంటేనే గ్లామర్ షో అని చెప్పాలి. ఆమె అందాల ఆరబోతలో అస్సలు సిగ్గుపడదు. ఇక ఇప్పుడు మాల్దీవుల్లో…
ప్రీతి ముకుందన్ (Preity Mukhundhan) ... తెలుగులో ఆమె మొదటి సినిమా 'కన్నప్ప'. అలాగే ఆమె నటించిన 'బ్లాస్ట్' (Blast)…
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక యాదగిరిగుట్ట (Yadagiri Gutta) లక్ష్మీనరసింహస్వామి ఆలయ నూతన ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేస్తూ జారీ చేసిన…
'నాగబంధం' (Nagabandham) సినిమాలో నటీనటులు చిన్నవాళ్లు. దర్శకుడు కూడా కొత్త. మొన్నటివరకు అంచనాలు కూడా తక్కువే. ఎప్పుడైతే ట్రయిలర్ రిలీజైందో,…