మాజీ మిస్ యూనివర్స్, సీనియర్ నటి సుష్మిత సేన్ ఇవ్వాల్సిన క్లారిటీ ఇచ్చేసింది. ఇప్పటికే పలువురితో డేటింగ్ చేసిన ఈ బ్యూటీ, తను ప్రస్తుతం సింగిల్ గా ఉన్నానని, ఇకపై కూడా సింగిల్ గానే ఉంటానని స్పష్టం చేసింది.
తనకు ప్రేమ, పెళ్లిపై ఆసక్తిలేదని స్పష్టం చేసింది సుష్మిత. గతంలో ఐదేళ్ల పాటు ఒకరితో ప్రేమలో ఉన్నానని, ఇప్పుడైతే అలాంటి ఆలోచనలు లేవని స్పష్టం చేసింది. ఇకపై కూడా తన స్నేహితులు, కుటుంబ సభ్యుల్ని ప్రేమిస్తూ గడిపేస్తానని స్పష్టం చేసింది సుష్మిత సేన్.
ఈమధ్యనే తన పెళ్లి చేసుకుంటాను అని ప్రకటన చేసింది ఆమె. ఇంతలోనే ఆమె మనసు మారినట్లు ఉంది. “ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది కాస్త కఠినంగా, గందరగోళంగా అనిపిస్తోంది. కానీ ఎప్పటికైనా పెళ్లి చేసుకుంటాను,” అంటూ మొన్నామధ్య రియాక్ట్ అయిన సుష్మిత, ఇప్పుడు మాత్రం తను పెళ్లికి శాశ్వతంగా దూరం అనే అర్థం వచ్చేలా మాట్లాడింది.
ప్రస్తుతం ఈమె వయసు 49 ఏళ్లు. గతంలో రణదీప్ హుడాతో, ఆ తర్వాత రోహమన్ షాల్ తో డేటింగ్ చేసింది. తాజాగా లలిత్ మోడీతో కూడా కొన్నాళ్లు గడిపినట్టు సుష్మితపై పుకార్లున్నాయి.
'చెన్నై లవ్ స్టోరీ' (Chennai Love Story సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). శ్రీ గౌరీప్రియ…
తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన ‘జన నాయకుడు’ (తమిళంలో జన నయగన్) తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే…
సామజవరగమన సినిమా తర్వాత శ్రీ విష్ణు, దర్శకుడు రామ్ అబ్బరాజు మరోసారి చేతులు కలిపారు. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి…
'టాక్సిస్' (Toxic) సినిమాపై కొన్ని రోజులుగా నడుస్తున్న ట్రోలింగ్ కు సింపుల్ గా, సుత్తిలేకుండా కౌంటర్ ఇచ్చారు నిర్మాత వెంకట్…
పరిశ్రమలో ప్రతి ఒక్కరికి చేదు అనుభవాలు, జ్ఞపకాలు ఉంటాయి. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి కూడా…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…