Categories: అవీ ఇవీ

ఆ 3 సినిమాలు రీ-రిలీజ్

దాదాపు ఏడాదిన్నరగా రీ-రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. ఈ ఏడాది కూడా ఆ ట్రెండ్ కొనసాగుతోంది. స్టార్ హీరోలు నటించిన పాత సినిమాలు మరోసారి 4కె వెర్షన్ లో థియేటర్లలోకి వస్తున్నాయి. అలా ఈ సీజన్ లో 3 ఇంట్రెస్టింగ్ సినిమాలు థియేటర్లలోకి మరోసారి వస్తున్నాయి. అవేంటో చూద్దాం..

రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ మూవీ విక్రమార్కుడు. రవితేజ డ్యూయల్ రూల్ పోషించిన ఈ సినిమా అప్పట్లో సెన్సేషనల్ హిట్టయింది. ఇప్పుడీ సినిమా మరోసారి వస్తోంది. 27వ తేదీన విక్రమార్కుడ్నిరీ-రిలీజ్ చేయబోతున్నారు. సినిమాలోని సూపర్ హిట్ డైలాగ్స్, సాంగ్స్ తో రీ-రిలీజ్ ట్రయిలర్ కూడా కట్ చేసి వదిలారు.

ఇక రీ-రిలీజ్ కు రెడీ అయిన మరో సినిమా మురారి. కృష్ణవంశీ-మహేష్ కాంబోలో వచ్చిన క్లాసిక్ ఇది. నిజానికి అప్పట్లో ఈ సినిమా ఫ్లాప్. అయితే ఆ తర్వాత కల్ట్ స్టేటస్ అందుకుంది. అందుకే రీ-రిలీజ్ పై చాలా బజ్ నడుస్తోంది. దీనికితోడు సినిమాను ట్రిమ్ చేసి మరీ రిలీజ్ చేస్తున్నారు. ఆగస్ట్ 9న మళ్లీ వస్తున్నాడు మురారి.

అటు రామ్ గోపాల్ వర్మను దర్శకుడిగా పరిచయమైన శివ సినిమా కూడా రీ-రిలీజ్ కు రెడీ అయింది. ఇది కూడా కల్ట్ సినిమానే. అప్పటివరకు తెలుగులో వస్తున్న సినిమా మేకింగ్ ను సమూలంగా మార్చేసిన మూవీ ఇది. నాగార్జున కెరీర్ లోనే మైల్ స్టోన్ గా నిలిచిన ఈ సినిమా, ఆగస్ట్ 29న రీ-రిలీజ్ అవుతోంది.

Admin

Recent Posts

తన భార్యపై ట్రోలింగ్… తాజాగా స్పందించిన Akhil Akkineni

అక్కినేని అఖిల్ (Akhil Akkineni), జైనబ్‌ (Zainab Ravdjee) 2025 జూన్‌లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి జరిగిన వెంటనే ఈ…

7 hours ago

Irumudi: రవితేజ సినిమా విడుదల వాయిదా పడిందా?

రవితేజ (Ravi Teja) కథానాయకుడిగా నటిస్తున్న ‘ఇరుముడి’ (Irumudi) చిత్రంపై ఇటీవల సోషల్ మీడియాలో నెలకొన్న సందేహాలకు తెరపడింది. బుక్‌మైషోలో…

7 hours ago

Devara: అంచనాల కంటే 50 శాతం ఎక్కువ వసూలు చేసింది!

ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘దేవర’ నిజమైన బ్లాక్‌బస్టర్ అని నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఏరియాల్లో…

7 hours ago

Agadha: బోనాలతో ప్రచార జాతరకు శ్రీకారం

దర్శకుడు ఎం.ఎస్. రాజు రూపొందిస్తున్న కొత్త చిత్రం ‘అగధ’ (Agadha). ఈ సినిమా ప్రచార కార్యక్రమాలకు టీం ఆదివారం ఘనంగా…

9 hours ago

OM: ధనుష్ అక్టోబర్ 16న విడుదలకు సన్నాహాలు

ధనుష్ (Dhanush) హీరోగా ఆర్ టేక్ స్టూడియోస్, వండర్‌బార్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న భారీ చిత్రానికి ‘ఓం: చాప్టర్ 1’…

9 hours ago

Jaya Krishna Ghattamaneni: మొదటి చిత్రం…మొదటి ముచ్చట్లు

జయకృష్ణ ఘట్టమనేని (Jaya Krishna Ghattamaneni) మొదటి చిత్రం… 'శ్రీనివాస మంగాపురం' (Srinivasa Mangapuram). ఈ నెల 30న విడుదల…

1 day ago