Tamannaa Bhatia: తమన్నా భాటియా పెద్ద హీరోయిన్. మునుపటితో పోల్చితే ఆమె ఇప్పుడు ఎక్కువ సంపాదిస్తోంది. ఎందుకంటే ఆమె హీరోయిన్ గా తెలుగులో అత్యధిక పారితోషికం పొందిన మొత్తం.. రెండు కోట్ల రూపాయలు. కానీ ఇప్పుడు ఆమె సినిమాకి హిందీలో 5 కోట్లు తీసుకుంటోంది. అదీ కూడా నటిగా కాదు ఐటెం సాంగ్.
ఇటీవల బాలీవుడ్ లో ఆమె చేసిన ఐటెం సాంగ్స్ చాలా వైరల్ అయ్యాయి. దాంతో ఆమె పాటలకు క్రేజ్ పెరిగింది. సినిమాల్లో ఒక్క పాటలో అలా కనిపిస్తే 5 కోట్లు వస్తున్నాయి ఆమెకి.
ఆమె హీరోయిన్ గానే కాదు తెలుగులో కూడా చాలా స్పెషల్ సాంగ్స్ చేసింది. 2014లోనే అల్లుడు శీను చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసినందుకు కోటి రూపాయలు దక్కించుకొంది. అలాంటి భామ మొదటిసారి ఒక సినిమాలో నటించి కూడా డబ్బులు తీసుకోలేదట.
ఇలా చెయ్యడం ఆమె కెరీర్ లో మొదటిసారి అని చెప్పాలి. విశాల్ భరద్వాజ్ తీసిన తాజా చిత్రం… ఓ రోమియో (O’Romeo). షాహిద్ కపూర్ హీరోగా నటించాడు. తృప్తి డుమ్రి హీరోయిన్ గా చేసింది. ఈ సినిమాలో చిన్న పాత్రలో తమన్నా కనిపిస్తుంది. ఈ పాత్ర కోసం ఆమె 12 రోజులు షూటింగ్ లో పాల్గొందట. అంటే ఒక ఐటెం సాంగ్ లో నటించే రోజులతో పోల్చితే ఎక్కువ రోజులు చేసింది ఈ సినిమాలో.
ఐనా కూడా విశాల్ భరద్వాజ్ సినిమాల్లో నటించాలనే ఉద్దేశంతో డబ్బులు తీసుకోకుండా ఈ పాత్ర చేసిందట.
'టాక్సిస్' (Toxic) సినిమాపై కొన్ని రోజులుగా నడుస్తున్న ట్రోలింగ్ కు సింపుల్ గా, సుత్తిలేకుండా కౌంటర్ ఇచ్చారు నిర్మాత వెంకట్…
పరిశ్రమలో ప్రతి ఒక్కరికి చేదు అనుభవాలు, జ్ఞపకాలు ఉంటాయి. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి కూడా…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…
హీరో నుంచి ముఖ్యమంత్రి కావడం అనేది అసాధారణ విజయం అని అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). కలలాంటి…
ఒక్క మే నెల తప్ప మార్చి నుంచి జూన్ వరకు వచ్చే ఏడాది సమ్మర్ (Summer 2027)లో ప్రతి నెలా…
టాలీవుడ్ నుంచి మరో మహిళా దర్శకురాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 'సింగ్…