విక్రమ్ సినిమా తంగలాన్ ఆల్రెడీ థియేటర్లలోకి వచ్చి వెళ్లిపోయింది. తమిళ్ లో ఓ మోస్తరుగా ఆడిన ఈ మూవీ, తెలుగులో బ్రేక్ ఈవెన్ అవ్వకుండానే రన్ ముగిసింది. ఎప్పుడైతే ఈ సినిమాను ఓటీటీకి ఇద్దామనుకున్నారో అప్పట్నుంచి కష్టాలు మొదలయ్యాయి.
ముందుగా వచ్చిన పుకారు ఏంటంటే.. థియేట్రికల్ రిజల్ట్ ఆధారంగా ఈ సినిమా ఓటీటీ రైట్స్ విషయంలో నెట్ ఫ్లిక్స్ కొర్రీ పెట్టిందట. భారీ రేటుకు కొనుగోలు చేసిన ఈ సినిమాకు అంత మొత్తం అనవసరం అనేది నెట్ ఫ్లిక్స్ మాటగా చెప్పుకొచ్చారు చాలామంది జనం.
ఓవైపు ఇదిలా నడుస్తుండగానే మరోవైపు సినిమాలో కంటెంట్ పై సదరు ఓటీటీ సంస్థ అభ్యంతరాలు వ్యక్తం చేసినట్టు వార్తలొస్తున్నాయి. సినిమాలో గొడ్డు మాంసం తినడం, గేదెను వధించడం లాంటివి నెట్ ఫ్లిక్స్ కు తలనొప్పిగా మారొచ్చని, మరోసారి రీ-ఎడిట్ చేసి, సెన్సార్ చేసి ఇవ్వాలని సదరు సంస్థ కోరినట్టు వార్తలొస్తున్నాయి.
ఇప్పటివరకు చెప్పుకున్నవన్నీ కేవలం ఊహాగానాలు మాత్రమే. కానీ అసలైన అడ్డంకి నిజంగానే మొదలైంది. ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వకుండా ఆదేశించాలంటూ తమిళనాడుకు చెందిన ఓ సామాజిక వేత్త కోర్టుకెక్కాడు. దీంతో ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ పై అనుమానాలు ఇంకా ఎక్కువయ్యాయి.
ఒక్క మే నెల తప్ప మార్చి నుంచి జూన్ వరకు వచ్చే ఏడాది సమ్మర్ (Summer 2027)లో ప్రతి నెలా…
టాలీవుడ్ నుంచి మరో మహిళా దర్శకురాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 'సింగ్…
తమిళ స్టార్ విజయ్ చివరి చిత్రంగా తెరకెక్కిన 'జన నాయకుడు' (తమిళంలో 'జన నాయగన్') ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు…
హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త సస్పెన్స్…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో హడావిడిగా విడుదల తేదీ ప్రకటించి కనీసం రెండు, మూడు సార్లు విడుదల తేదీని వాయిదా వేసే…
రామ్ చరణ్ పై తనకున్న అభిమానాన్ని ఇప్పటికే చాటుకున్నాడు అఖిల్ (Akhil Akkineni). తాజాగా ఎన్టీఆర్ తో తన అనుబంధాన్ని…