స్వీయ దర్శకత్వంలో మోహన్ లాల్, ఏ ముహూర్తాన బ్యారోజ్ సినిమాను ప్రారంభించాడో కానీ అప్పట్నుంచి ఆ సినిమాకు సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలుమార్లు ఈ సినిమా వాయిదా పడింది. ఒక దశలో మోహన్ లాల్ అనారోగ్యానికి కూడా గురయ్యారు.
ఇప్పుడీ సినిమా మరోసారి ఈ నటుడికి తలనొప్పులు తెచ్చిపెట్టింది. బ్యారోజ్ సినిమా కాపీరైట్ చిక్కుల్లో పడింది. జార్జ్ తుండిపరంబిల్ అనే వ్యక్తి ఈ సినిమాపై కేసు వేశాడు. రిలీజ్ కాకుండా ఆపాలంటూ కోర్టును ఆశ్రయించాడు. దీంతో మోహన్ లాల్ ఇప్పుడు లీగల్ చిక్కుల్లో ఇరుక్కున్నట్టయింది.
బ్యారోజ్ అనేది పిల్లల చుట్టూ తిరిగే ఫాంటసీ కథతో వస్తున్న సినిమా. స్వీయ దర్శకత్వంలో మోహన్‌లాల్ నటించిన సినిమా ఇది. ఈ సినిమాలో చాలా సన్నివేశాలు, తను రాసిన మాయ అనే నవలలో పారాగ్రాఫులకు దగ్గరగా ఉన్నాయని ఆరోపిస్తున్నాడు జార్జ్.
చాలా కాలంగా నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా ఈ ఏడాది విడుదల కావాలి. అయితే తాజా కేసు వల్ల సినిమా ఇంకాస్త ఆలస్యమయ్యేలా ఉంది. ఇప్పటికే హేమ కమిటీ రిపోర్ట్ తో ఇబ్బందులు పడుతున్న ఈ నటుడు.. ఇప్పుడీ లీగల్ ఇష్యూను ఎలా ఫేస్ చేస్తాడో చూడాలి.
"యానిమల్" చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన త్రిప్తి దిమ్రి (Tripti Dimri) మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రస్తుతం…
హీరోయిన్ కాయదు లోహర్ (Kayadu Lohar) తన పాఠశాల రోజుల్లో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని బయటపెట్టింది. పదో తరగతి చదువుతున్న…
హీరో, దర్శకుడు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఇలా అనేక విధాలుగా పాపులర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence). "ముని", కాంచన సినిమాల…
మహేష్ బాబు,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'గుంటూరు కారం' (Guntur Kaaram) సినిమా గురించి ఇప్పుడు ప్రత్యేకంగా…
పూజ హెగ్డే (Pooja Hegde)కి ఇప్పుడు లక్ తిరిగినట్టు కనిపిస్తోంది. ఆమెకి హిట్స్ లేవు కానీ వరుసగా అవకాశాలు వస్తూనే…
ఈ రోజు అల్లరి నరేష్ (Allari Naresh) పుట్టిన రోజు. దాంతో, నరేష్ కొత్త సినిమా "రంభ ఊర్వశి మేనక"…