Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

ఆఖరి మెట్టు దగ్గర ఆగాయి

TeluguCinema, July 28, 2020

లాక్ డౌన్ కారణంగా ‘V’ మూవీ రిలీజ్ కు జస్ట్ కొన్ని రోజుల ముందు థియేటర్లు బంద్ అయ్యాయి. అలా ఆఖరి నిమిషంలో ఆగిపోయిన పెద్ద సినిమాగా మిగిలిపోయింది ‘V’. అయితే ఇలా ఆఖరి నిమిషంలో షూటింగ్ ఆగిపోయిన పెద్ద సినిమాలు చాలానే ఉన్నాయి. ఒక్క 3 వారాలు కరోనా కనికరిస్తే ఈపాటికి ఆ సినిమాల ఫస్ట్ కాపీలు రెడీ అయి ఉండేవి. కానీ గుమ్మడికాయ కొట్టడానికి జస్ట్ కొన్ని రోజుల ముందు అవన్నీ ఎక్కడివక్కడ ఆగిపోయాయి.

ఉదాహరణకు ‘లవ్ స్టోరీ’ సినిమానే తీసుకుంటే.. జస్ట్ 15 రోజుల ముందు ఈ సినిమా ఆగిపోయింది. కరోనా వస్తుందని తెలియక తనదైన స్టయిల్ లో నిదానంగా షూటింగ్ చేశాడు కమ్ముల. తీరా అంతా అయిపోయిందనుకున్న టైమ్ లో, ఆఖరి నిమిషంలో షూటింగ్ ఆగిపోయింది.

Solo Brathuke Better and Krack

సాయితేజ్ నటిస్తున్న ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాది కూడా ఇదే పరిస్థితి. మరో 10 రోజుల్లో గుమ్మడికాయ కొట్టేస్తారనగా షూటింగ్ ఆగిపోయింది. అంతా అనుకున్నట్టు జరిగితే ఈ సినిమా రిలీజై ఈపాటికి 3 నెలలయ్యేది. కానీ 10 రోజుల షూటింగ్ పెండింగ్ తో ఆగిపోయింది.

‘క్రాక్’ సినిమా కూడా ఇలాంటిదే. ఈ సినిమాకు 20 రోజుల షూటింగ్ పెండింగ్ ఉంది. ఈలోగా లాక్ డౌన్ పడింది. రవితేజ ఇప్పట్లో సెట్స్ పైకి వచ్చేలా లేడు. శృతిహాసన్ ముంబయిలోనే తిష్టవేసింది. ఇలా ఈ 3 సినిమాలు షూటింగ్ పూర్తవ్వడానికి కొన్ని రోజుల ముందు ఆగిపోయాయి.

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Nagabandham, Akhanda 2 and Hari Hara Veera Mallu,
    Sanathana ట్రెండ్ తెలుగు సినిమాలకు కలిసి రావడం లేదా?
  • Kajal Aggarwal
    Kajal Aggarwal: ఇన్ స్టాలో అందాల ఆరబోత, సినిమాల్లో నో గ్లామర్!
  • Aishwarya Rajesh
    ఆ మేజిక్ కోసం చూస్తానంటున్న Aishwarya Rajesh
  • Sreeleela
    అలాంటి వాడు దొరికితే రెడీ అంటోన్న Sreeleela
  • Shriya
    Shriya: హీరోయిన్ పై కామెంట్ చేస్తే థ్యాంక్స్ చెప్పిన భర్త
  • Bhagyashri Borse
    Bhagyashri Borse: తొలి సినిమా నుంచి ఆ కథలే భాగ్యం
  • Malavika Mohanan
    మాల్దీవుల్లో Malavika Mohanan అందాల ఆరబోత
  • Neha Dhupia
    Neha Dhupia: ‘వెనకనుంచి తీయొద్దురా బాబు’, పాపరాజీపై మండిపాటు
  • Kayadu Lohar
    Kayadu Lohar: రాయితో బుర్ర పగలగొట్టిన హీరోయిన్
  • Pooja Hegde
    Pooja Hegde: పూజ పేరు ఇంకో భారీ ప్రాజెక్టులో!
  • Nabha Natesh
    నాగబంధంలో స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను: Nabha Natesh
  • Sonakshi Sinha
    Sonakshi Sinha: అవకాశాలు తగ్గినా పర్లేదు!
  • Ram Charan
    Peddi: మిగతా అన్ని భాషల్లోనూ అట్టర్ ఫ్లాప్
  • Vaishnavi Chaitanya
    Sithara: జులై నుంచి అక్టోబర్, వరుసగా నాలుగు చిత్రాలు
  • Rhea Chakraborty
    Rhea Chakraborty: తోడు కావాలి కానీ ఇప్పుడు కాదు

Recent News

  • Sanathana ట్రెండ్ తెలుగు సినిమాలకు కలిసి రావడం లేదా?
  • RAPO23: రామ్ దర్శకత్వం, సామ్ సంగీతం
  • Mega158: భారీ ఫైట్స్ స్వయంగా చేస్తోన్న చిరంజీవి
  • కమల్ హాసన్ కి కూతురు Shruti Haasan సపోర్ట్
  • Kajal Aggarwal: ఇన్ స్టాలో అందాల ఆరబోత, సినిమాల్లో నో గ్లామర్!
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes