త్రిష (Trisha), విజయ్ (Vijay) మధ్య ఉన్న బంధం గురించి రకరకాల కామెంట్స్ నడుస్తున్న టైంలో వారిద్దరూ మొన్న ఒక పెళ్లి వేడుకకు కలిసి హాజరయ్యారు. దంపతుల మాదిరిగా కలిసి ఆ పెళ్లి వేడుకకు వచ్చి, వారిని విష్ చేసి మళ్ళీ ఇద్దరూ ఒకే కారులో వెళ్లిపోయారు.
అలా ఇద్దరూ కలిసి ప్రత్యక్షం కావడానికి కారణం ఉంది. ప్రస్తుతం తనని రాజకీయంగా ప్రత్యర్థి పార్టీలు త్రిషతో అఫైర్ నడుస్తోంది అని టార్గెట్ చేస్తున్న టైంలో అందరికీ సమాధానం ఇచ్చేందుకు ఇలా చేశారట. తాము కలిసే ఉంటున్నామని, తన భార్యతో డివోర్స్ వచ్చాక అధికారికంగా జంటగా మారుతామని విజయ్ ఇండైరెక్ట్ గా చెప్పేసినట్లే.
ఐతే, దీని తర్వాత విజయ్ కి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో చాలా నెగెటివిటీ నడుస్తోంది. మొన్నటివరకు ఆరాధించాం కానీ ఇకపై విజయ్ ని ఆరాధించబోము అంటూ తమిళ సినిమా అభిమానులు, జర్నలిస్టులు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు తెగ తిడుతూ పోస్టులు పెడుతున్నారు. విజయ్ కి సోషల్ మీడియాలో ఫాలొవర్స్ సంఖ్య తగ్గింది అనే మాట వినిపిస్తోంది.
మరోవైపు, త్రిషని టార్గెట్ చేస్తూ కూడా చాలా కామెంట్స్ వస్తున్నాయి. ఐతే, ఆమె ఫాలోవర్స్ సంఖ్య తగ్గలేదు. ఆమెకి ఇన్ స్టాగ్రామ్ లో 8.4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అందులో ఏ మార్పు లేదు. ఆమెకి ఉన్న ఫాలోవర్స్ తగ్గిపోలేదు, కొత్తగా పెరగలేదు.
త్రిష మాత్రం ఇప్పుడు వరుసగా ఫోటోలు షేర్ చేస్తోంది, తన ఇన్ స్టా స్టోరీలు అప్డేట్ చేస్తోంది. రెండు వారాలు సైలెంట్ గా ఉండి ఇప్పుడు ఎక్కువగా షేర్ చేస్తోంది.
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…
లెనిన్ (Lenin) తర్వాత భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) తెలుగులో ఏ సినిమా చెయ్యబోతుంది? మొన్నటి వరకు ఆమెని ఐరన్…
ఎన్టీఆర్ కి రాజకీయాలు కొత్త కాదు. 2009లోనే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశారు. ఐతే, ఆ తర్వాత…
తెలుగులో "ఇడుపు కాయితం" (Idupu Kayitham) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది యూట్యూబ్ సంచలనం నాగదుర్గ (Naga Durga).…
రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఏం మాట్లాడినా, ఏ ట్వీట్ వేసినా అది పీక్స్ లో ఉంటుంది.…