హరిహర వీరమల్లు సినిమా సెట్స్ పైకి వచ్చింది. లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ కల్యాణ్, సెట్స్ పైకి వచ్చాడు. ఈ సినిమా కోసం బెజవాడలో సెట్ వేశారు. పనిలోపనిగా రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. వచ్చే ఏడాది సమ్మర్ ఎట్రాక్షన్ గా మార్చి 28న హరిహర వీరమల్లు సినిమాను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.
ఓ పెద్ద సినిమా విడుదల చేస్తే, ఆ ప్రభావం ఇతర సినిమాలపై కచ్చితంగా పడుతుంది. పవన్ సినిమా రిలీజ్ డేట్ కూడా ఓ సినిమాపై పడింది. అదే విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఓ సినిమా చేస్తున్నాడు. వచ్చే ఏడాది మార్చి 28న ఈ సినిమాను విడుదల చేస్తామని ఇదివరకే ప్రకటించారు.
కట్ చేస్తే, ఇప్పుడు అదే తేదీకి పవన్ సినిమాను షెడ్యూల్ చేశారు. సమ్మర్‌కి ఇంకా చాలా సినిమాలు వస్తున్నాయి. కాబట్టి విజయ్ దేవరకొండ సినిమాను వాయిదా వేయడం సాధ్యం కాదు. అలా అని ప్రీ-పోన్ చేయడం కూడా సాధ్యం కాదు. అలా చేస్తే వేసవి శెలవుల అడ్వాంటేజ్ కోల్పోతుంది విజయ్ సినిమా.
విజయ్ దేవరకొండ సినిమాకు ఇంకా టైటిల్ ఎనౌన్స్ చేయలేదు. త్వరలోనే టైటిల్ ఎనౌన్స్ చేస్తామని స్వయంగా విజయ్ దేవరకొండ ప్రకటించాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కేరళలో జరుగుతోంది.
"యానిమల్" చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన త్రిప్తి దిమ్రి (Tripti Dimri) మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రస్తుతం…
హీరోయిన్ కాయదు లోహర్ (Kayadu Lohar) తన పాఠశాల రోజుల్లో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని బయటపెట్టింది. పదో తరగతి చదువుతున్న…
హీరో, దర్శకుడు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఇలా అనేక విధాలుగా పాపులర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence). "ముని", కాంచన సినిమాల…
మహేష్ బాబు,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'గుంటూరు కారం' (Guntur Kaaram) సినిమా గురించి ఇప్పుడు ప్రత్యేకంగా…
పూజ హెగ్డే (Pooja Hegde)కి ఇప్పుడు లక్ తిరిగినట్టు కనిపిస్తోంది. ఆమెకి హిట్స్ లేవు కానీ వరుసగా అవకాశాలు వస్తూనే…
ఈ రోజు అల్లరి నరేష్ (Allari Naresh) పుట్టిన రోజు. దాంతో, నరేష్ కొత్త సినిమా "రంభ ఊర్వశి మేనక"…