హోరాహోరీగా సాగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పర్వం ముగిసింది. సోమవారం పోలింగ్ ముగిసిన వెంటనే జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, నటుడు నాగబాబు కొన్ని ట్వీట్లు చేశారు. అందులో ప్రధానమైనది మావాడు, పరాయి వాడు అంటూ ఆయన పోస్ట్ చేసిన ట్వీట్ సంచలనం రేపింది.
“మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైన పరాయివాడే… మాతో నిలబడేవాడు పరాయివాడైన మావాడే…!” ఇది ఆయన ట్వీట్.
పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో తమకు హ్యాండ్ ఇచ్చిన ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు గురించి ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టారని కొందరు అంచనా వేశారు. ఐతే, కొందరు అల్లు అర్జున్ ని టార్గెట్ చేసి వేశారెమో అని సందేహం వ్యక్తం చెయ్యడం విశేషం. ఎందుకంటే, పోలింగ్ కి రెండు రోజుల ముందు అల్లు అర్జున్ నంద్యాల వెళ్లి అక్కడి వైస్సార్ పార్టీ అభ్యర్థికి మద్దతు తెలిపారు. అక్కడ వైఎస్సార్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న రవి చంద్రశేఖర్ రెడ్డి తనకు మంచి మిత్రుడు, అందుకే అతనికి మద్దతు తెలిపాను అని అల్లు అర్జున్ ప్రకటించారు. పార్టీకి కాకుండా మిత్రుడికి మాత్రమే మద్దతు చెప్పాను అన్నారు.
ఐతే, నాగబాబు బహుశా అల్లు అర్జున్ ని దృష్టిలో పెట్టుకొని ఇలా ట్వీట్ చేసి ఉంటారని చాలా మంది డౌట్. కానీ మెగా ఫ్యామిలీ గురించి తెలిసిన వారు ఎవరూ నాగబాబు అల్లు అర్జున్ ని ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టి ఉండరని ఈజీగా చెప్పగలరు.
సో, ఈ పోస్ట్ తమ ఫ్యామిలీ హీరో కోసం కాదు.
'టాక్సిస్' (Toxic) సినిమాపై కొన్ని రోజులుగా నడుస్తున్న ట్రోలింగ్ కు సింపుల్ గా, సుత్తిలేకుండా కౌంటర్ ఇచ్చారు నిర్మాత వెంకట్…
పరిశ్రమలో ప్రతి ఒక్కరికి చేదు అనుభవాలు, జ్ఞపకాలు ఉంటాయి. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి కూడా…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…
హీరో నుంచి ముఖ్యమంత్రి కావడం అనేది అసాధారణ విజయం అని అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). కలలాంటి…
ఒక్క మే నెల తప్ప మార్చి నుంచి జూన్ వరకు వచ్చే ఏడాది సమ్మర్ (Summer 2027)లో ప్రతి నెలా…
టాలీవుడ్ నుంచి మరో మహిళా దర్శకురాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 'సింగ్…