న్యూస్

Peddi vs Lenin: నిజంగా పోటీపడుతారా?

విడుదల తేదీల విషయంలో చాలా కన్ఫ్యూజన్ ఉంది. పెద్ది (Peddi) సినిమా రెండుసార్లు డేట్ మార్చుకొంది. లెనిన్ (Lenin) ఒకసారి మార్చింది. తాజాగా టాక్సిక్ (Toxic) జూన్ 4 నుంచి వాయిదాపడింది. కొత్త రిలీజ్ డేట్ ప్రకటించలేదు. ఐతే, లెనిన్ (Lenin) గురించి నాగార్జున చేసిన ట్వీట్ ఒక్కసారిగా అందరిలో చర్చకు తెరలేపింది.

“లెనిన్ మొదటి కట్ చూశాను. కొత్త అఖిల్ ని చూస్తారు. జూన్ 26న థియేటర్లో కలుద్దాం,” అని నిర్మాత హోదాలో నాగార్జున అక్కినేని లెనిన్ రిలీజ్ డేట్ గురించి చెప్పారు ఈ రోజు.

ఐతే, ఈ సినిమాని ఇంతకుముందు వాయిదా వేస్తున్న రామ్ చరణ్ సినిమా కోసమే అని చెప్పడం విశేషం.

ఇంతకుముందు పెద్ది మార్చి 27 నుంచి ఏప్రిల్ 30కి వాయిదా పడింది. అప్పుడు మే 1న రావాల్సిన లెనిన్ సినిమాని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. “రామ్ చరణ్ పై ఉన్న గౌరవం, అభిమానంతో మా సినిమా విడుదల తేదీని జూన్ 26కి మారుస్తున్నాం,”అనే కారణం అప్పుడు చెప్పారు. ఐతే కొన్ని రోజుల తర్వాత “పెద్ది” సినిమాని మరోసారి వాయిదా వేశారు. తాజాగా, ఈ సినిమాకి జూన్ 25 డేట్ అని ప్రకటించారు.

“పెద్ది” జూన్ 25కి వాయిదా పడడంతో “లెనిన్” తప్పకుండా డేట్ మార్చుకుంటుంది అని అందరూ భావిస్తున్న వేళ నాగార్జున తమ డేట్ 26 అనే ట్వీట్ వెయ్యడం విచిత్రం. పైగా జూన్ 4 నుంచి “టాక్సిక్” సినిమా తప్పుకొంది.

నిజంగా “పెద్ది” వర్సెస్ “లెనిన్” పోటీ ఉంటుందా? మరోసారి డేట్ ని మారుస్తారా? క్లారిటీ కోసం కొన్ని రోజులు ఆగాలి.

TeluguCinema Team

TeluguCinema Desk is the editorial team behind TeluguCinema.com, one of the oldest and most trusted websites dedicated to the Telugu film industry since the late 1990s. With decades of experience in entertainment journalism, the team is committed to delivering accurate news, credible reports, exclusive updates, and insightful features while upholding the highest standards of fairness, authenticity, and journalistic integrity.

Recent Posts

Jaya Krishna Ghattamaneni: మొదటి చిత్రం…మొదటి ముచ్చట్లు

జయకృష్ణ ఘట్టమనేని (Jaya Krishna Ghattamaneni) మొదటి చిత్రం… 'శ్రీనివాస మంగాపురం' (Srinivasa Mangapuram). ఈ నెల 30న విడుదల…

5 hours ago

Kavya Thapar: అందాల ఆరబోతలో నర్గీస్ తో పోటీ

కావ్య థాపర్ (Kavya Thapar) పలు తెలుగు సినిమాల్లో నటించింది. అందాల ఆరబోతలో ఆమె ఎలాంటి ఆంక్షలు లేవు. ఐతే…

12 hours ago

Sri Gouri Priya: తెలుగు అమ్మాయికి గుర్తింపు వచ్చింది!

శ్రీ గౌరీ ప్రియ (Sri Gouri Priya) అచ్చ తెలుగు నటి. తెలుగు అమ్మాయిలకు ఎక్కువగా అవకాశాలు రావు అనే…

13 hours ago

Nara Brahmani: ‘సర్జరీ పూర్తయింది, నాన్న ఎనర్జీతో ఉన్నారు

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఇటీవల షూటింగ్ లో గాయపడ్డారు. తాజాగా ఆయనకి సర్జరీ జరిగింది. ఐతే ఆసుపత్రి సర్జరీ…

13 hours ago

హీరోయిన్ నుంచి డబ్బులు తీసుకున్న Kiran Abbavaram

'చెన్నై లవ్ స్టోరీ' (Chennai Love Story సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). శ్రీ గౌరీప్రియ…

1 day ago

Anandhi Ajay: నన్ను ఎందుకు తీసేశారు, నటి ఆవేదన

తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన ‘జన నాయకుడు’ (తమిళంలో జన నయగన్) తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే…

1 day ago