పూజ హెగ్డే (Pooja Hegde) పుట్టింది, పెరిగింది ముంబైలోనే. కానీ ఆమె తల్లితండ్రులు కర్ణాటకకి చెందినవారు. మంగుళూరు నుంచి వెళ్లి ముంబైలో సెటిల్ అయింది వారి కుటుంబం. తాజాగా పూజ హెగ్డే తన తల్లితండ్రులతో కలిసి మంగుళూరు (Mangalore) వెళ్ళింది. అక్కడ గుడుల చుట్టూ ప్రదిక్షణలు చేసింది. ప్రత్యేక పూజలు నిర్వహించింది.
“నమ్మ ఊరు డా పొన్ను” (మా ఊరు అమ్మాయిని) అనే క్యాప్షన్ తో ఫోటోలు షేర్ చేసింది.
ఐతే, ఇది సొంత ఊరుకి సహజంగా వెళ్లే ట్రిప్పా? లేక ఈ పూజలు, గుళ్ల సందర్శనల వెనుక ప్రత్యేక కారణం ఉందా? ఆమె నటించిన “జన నాయగన్” (Jana Nayagan) అనేక సమస్యలు, వాయిదాల తర్వాత త్వరలోనే విడుదల కానుంది. అలాగే హిందీలో ఆమె నటించిన “హై జవానీ తో ఇష్క్ హోనా హై (‘Hai Jawani Toh Ishq Hona Hai’) జూన్ 5న రిలీజ్ అవుతుంది. దాంతో వీటి విజయాల కోసం ఆమె పూజలు చేసింది అని కొందరు చెప్తున్నారు.
మరికొందరు ఆమె పెళ్ళికి ప్రిపేర్ అవుతోందని, అందులో భాగంగానే వాళ్ల ఫ్యామిలీ పూజలు చేసింది అని అంటున్నారు. ఈ భామ రోహన్ మెహ్రా అనే ఒక వర్ధమాన బాలీవుడ్ నటుడితో డేటింగ్ లో ఉంది.
అక్కినేని అఖిల్ (Akhil Akkineni), జైనబ్ (Zainab Ravdjee) 2025 జూన్‌లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి జరిగిన వెంటనే ఈ…
రవితేజ (Ravi Teja) కథానాయకుడిగా నటిస్తున్న ‘ఇరుముడి’ (Irumudi) చిత్రంపై ఇటీవల సోషల్ మీడియాలో నెలకొన్న సందేహాలకు తెరపడింది. బుక్‌మైషోలో…
ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘దేవర’ నిజమైన బ్లాక్‌బస్టర్ అని నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఏరియాల్లో…
దర్శకుడు ఎం.ఎస్. రాజు రూపొందిస్తున్న కొత్త చిత్రం ‘అగధ’ (Agadha). ఈ సినిమా ప్రచార కార్యక్రమాలకు టీం ఆదివారం ఘనంగా…
ధనుష్ (Dhanush) హీరోగా ఆర్ టేక్ స్టూడియోస్, వండర్‌బార్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న భారీ చిత్రానికి ‘ఓం: చాప్టర్ 1’…
జయకృష్ణ ఘట్టమనేని (Jaya Krishna Ghattamaneni) మొదటి చిత్రం… 'శ్రీనివాస మంగాపురం' (Srinivasa Mangapuram). ఈ నెల 30న విడుదల…