తమిళ సినిమాతో హీరోయిన్ అయింది. ఇక అక్కడే ఫిక్స్ అయిపోతుందనుకున్నే టైమ్ కు టాలీవుడ్ కు వచ్చేసింది. ఇక్కడ కూడా 2 సినిమాలు చేసింది. ఇక ఇక్కడే ఉంటుందనుకున్న టైమ్ లో బాలీవుడ్ కు వెళ్లింది. అక్కడ ఫ్లాప్ హీరోయిన్ గా ముద్ర వేయించుకుంది. మళ్లీ టాలీవుడ్ కు వచ్చింది. ఇప్పుడు బన్నీతో సినిమా చేస్తోంది. అయితే చేసిన తప్పునే మళ్లీ రిపీట్ చేయబోతోంది బన్నీ బ్యూటీ పూజా హెగ్డే.
అల్లు అర్జున్ సరసన డీజే సినిమాలో నటిస్తోంది ఈ కన్నడ భామ. కాస్త హైప్ తో వస్తున్న సినిమా కాబట్టి కచ్చితంగా అమెకు తెలుగు నుంచి మరిన్ని ఆఫర్లు వస్తాయి. కానీ పూజా హెగ్డే కు మాత్రం బాలీవుడ్ డ్రీమ్స్ ఇంకా వదిలినట్టు లేవు. అందుకే మరోసారి బాలీవుడ్ కు చెక్కేసే ప్రయత్నాల్లో ఉంది. హిందీలో హృతిక్ తో కలిసి మొహాంజదారో సినిమా చేసేంది. ఆ మూవీ అట్టర్ ఫ్లాప్ అయింది. బాలీవుడ్ లో ఐరన్ లెగ్ ఇమేజ్ తెచ్చుకుంది.
ఇంత జరిగినప్పటికీ మరోసారి బాలీవుడ్ కు వెళ్లాలని తహతహలాడుతోందట పూజా హెగ్డే. కొంతమంది మేకర్స్ తో చర్చలు జరుపుతోందట. ఓవైపు టాలీవుడ్ నుంచి ఆమెకు ఆఫర్లు వస్తున్న టైమ్ లో ఇలా మరోసారి రిస్క్ తీసుకోవడానికి రెడీ అవుతోంది పూజా హెగ్డే.
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…
లెనిన్ (Lenin) తర్వాత భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) తెలుగులో ఏ సినిమా చెయ్యబోతుంది? మొన్నటి వరకు ఆమెని ఐరన్…
ఎన్టీఆర్ కి రాజకీయాలు కొత్త కాదు. 2009లోనే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశారు. ఐతే, ఆ తర్వాత…
తెలుగులో "ఇడుపు కాయితం" (Idupu Kayitham) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది యూట్యూబ్ సంచలనం నాగదుర్గ (Naga Durga).…
రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఏం మాట్లాడినా, ఏ ట్వీట్ వేసినా అది పీక్స్ లో ఉంటుంది.…