ఎన్ని సార్లు ఖండించినా, ఎంత మొత్తుకున్నా ఈ రూమర్ మాత్రం ఆగట్లేదు. ఎందుకంటే వీళ్లిద్దరి మధ్య ఆన్ స్క్రీన్ తో పాటు ఆఫ్ స్క్రీన్ కూడా ఓ రేంజ్ లో కెమిస్ట్రీ నడుస్తోంది. అందుకే రాజ్ తరుణ్, హెబ్బా పెళ్లిచేసుకుంటారేమో అనే పుకార్లు జోరుగా వినిపిస్తున్నాయి. దానికి తోడు రిలీజ్ కు రెడీ అవుతున్న ‘అంధగాడు’ సినిమాలో కూడా ఈ జోడీనే మరోసారి రిపీట్ అవ్వడంతో రూమర్లకు మంచి బలం వచ్చింది.
ఈ విషయంపై రాజ్ తరుణ్ చాలా క్లారిటీ ఇచ్చాడు. కానీ ఆ క్లారిటీ అదోలా ఉంది. పూర్తిగా ఖండించినట్టు కనిపించడం లేదు. అలా అని ఒప్పుకున్నట్టు అనిపించడం లేదు. హెబ్బాతో 30 సినిమాలు చేయాలని ఉందని, ఆమె పక్కనుంటే చాలా కంఫర్ట్ గా ఉంటుందని ఇప్పటికే చాలాసార్లు ప్రకటించాడు రాజ్ తరుణ్. కానీ తామిద్దరి మధ్య “కుచ్ కుచ్ హోతా హై” లాంటిది ఏదీ లేదంటాడు. హెబ్బా లేకుండా ఉండలేనంటాడు. కానీ హెబ్బాతో రిలేషన్ షిప్ అంటూ వార్తలు రాయొద్దంటాడు.
హెబ్బా పటేల్ ను రాజ్ తరుణ్ పెళ్లి చేసుకుంటాడా చేసుకోడా అనే విషయాన్ని పక్కనపెడితే.. ప్రస్తుతానికైతే వాళ్లిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అట. ఇద్దరూ కామన్ గా చెబుతున్న స్టేట్ మెంట్ ఇది. అయితే తాజాగా వస్తున్న మరో రూమర్ ఏంటంటే.. వీళ్లిద్దరూ ప్రస్తుతం ఒకర్నొకరు అర్థంచేసుకునే ప్రాసెస్ లో ఉన్నారట. కలిసి సినిమాలు చేయడం ఆపేవరకు ఈ పుకార్లు ఇలా వస్తూనే ఉంటాయేమో.
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…
లెనిన్ (Lenin) తర్వాత భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) తెలుగులో ఏ సినిమా చెయ్యబోతుంది? మొన్నటి వరకు ఆమెని ఐరన్…
ఎన్టీఆర్ కి రాజకీయాలు కొత్త కాదు. 2009లోనే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశారు. ఐతే, ఆ తర్వాత…
తెలుగులో "ఇడుపు కాయితం" (Idupu Kayitham) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది యూట్యూబ్ సంచలనం నాగదుర్గ (Naga Durga).…
రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఏం మాట్లాడినా, ఏ ట్వీట్ వేసినా అది పీక్స్ లో ఉంటుంది.…