ప్రస్తుతం పూజా హెగ్డేపై అంతా ఇలాంటి బెట్టింగ్ లే కాస్తున్నారు. ఎందుకంటే తెలుగులో ఆమెకన్నీ ఫ్లాపులే వచ్చాయి. దీంతో గ్యాప్ కూడా అనివార్యమైంది. ఇలాంటి టైమ్ లో డీజే సినిమాలో హీరోయిన్ ఛాన్స్ వరించింది పూజాకు. ఈ సినిమా క్లిక్ అయితే ఆమె తెలుగులో స్టార్ హీరోయిన్ల రేసులోకి ఎంటర్ అవుతుంది. లేదంటే మాత్రం ఫ్లాపులతో హ్యాట్రిక్ కొట్టిన హీరోయిన్ గా మరోసారి ఫేడవుట్ అవ్వడం ఖాయం.
తెలుగులో ఇప్పటికే ‘ముకుంద’, ‘ఒక లైలా కోసం’ సినిమాలు చేసింది పూజా హెగ్డే. ఆ రెండు సినిమాలూ ఆమెకు ఆశించిన స్థాయిలో గుర్తింపు ఇవ్వలేదు. అందుకే స్టార్ హీరోల సినిమా ఛాన్సులు కూడా రాలేదు. దీంతో టాలీవుడ్ కు కాస్త గ్యాప్ ఇచ్చింది. మళ్లీ ఇన్నేళ్లకు అల్లు అర్జున్ సరసన ‘డీజే’ సినిమాలో నటించింది పూజా హెగ్డే. నిజానికి డీజేతో సంబంధం లేకుండానే ఆమెకు క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి. నెక్ట్స్ సినిమాకు రెమ్యూనరేషన్ కూడా కోటి చేసేసింది. కాకపోతే అది కేవలం హైప్ మాత్రమే. డీజే హిట్ అయితేనే ఆమెకు సిసలైన క్రేజ్ మొదలైనట్టు లెక్క. అందుకే డీజేతో ఆమె క్లిక్ అవుతుందా.. లేక ఖాళీ చేసి వెళ్లిపోతుందా అని అంతా చర్చించుకుంటున్నారు.
మరి దువ్వాడ ఈ చిన్నదాన్ని ఆదుకుంటాడా?
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…
లెనిన్ (Lenin) తర్వాత భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) తెలుగులో ఏ సినిమా చెయ్యబోతుంది? మొన్నటి వరకు ఆమెని ఐరన్…
ఎన్టీఆర్ కి రాజకీయాలు కొత్త కాదు. 2009లోనే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశారు. ఐతే, ఆ తర్వాత…
తెలుగులో "ఇడుపు కాయితం" (Idupu Kayitham) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది యూట్యూబ్ సంచలనం నాగదుర్గ (Naga Durga).…
రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఏం మాట్లాడినా, ఏ ట్వీట్ వేసినా అది పీక్స్ లో ఉంటుంది.…