యాక్షన్ తో హిట్ వచ్చేనా?

TeluguCinema 21 Apr 2023
agent akhil


అఖిల్ హీరోగా దర్శకుడు సురేందర్ రెడ్డి తీసిన ‘ఏజెంట్’ సినిమా వచ్చే వారమే విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ ఇటీవల బయటికి వచ్చింది. ట్రైలర్ చూస్తే యాక్షన్ సీన్లు టాప్ రేంజ్ లో ఉన్నాయి. అఖిల్ కూడా బాగున్నాడు. యాక్షన్ హీరోకుండాల్సిన ఫిజిక్ పొందాడు. తనని తాను కొత్తగా ఆవిష్కరించుకున్నట్లు కనిపిస్తోంది.

అఖిల్ అక్కినేని మొదటి సినిమాతోనే టాప్ హీరోగా నిలబడతాడు అని అనుకున్నారు అంతా. కానీ ఆయన ఇప్పటివరకు నటించిన ఏ సినిమా కూడా బ్లాక్ బస్టర్ కాలేదు. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మాత్రం మోస్తరుగా ఆడింది.

ఆయనకిప్పుడు సాలిడ్ హిట్ బ్లాక్బస్టర్ కావాలి. గతంలో కళ్యాణ్ రామ్, రవితేజ, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి హీరోలకు మంచి హిట్స్ ఇచ్చిన సురేందర్ రెడ్డి అఖిల్ కి మొదటి బ్లాక్ బస్టర్ ఇస్తాడా?

యాక్షన్ సినిమాతో అఖిల్ కి రావాల్సిన గుర్తింపు, సక్సెస్ వస్తే ఇక అతను రొమాంటిక్ సినిమాలు కాకుండా ఇలాంటివే చేసుకుంటాడు.