కోట్ల కారు కొన్న మహేష్ బాబు

మహేష్ బాబుకి ఎప్పటికప్పుడు లగ్జరీ కొత్త కార్లు కొనడం అలవాటు. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్ద హీరోలందరూ టొయోటా వెల్ఫీర్ కార్లను లేదా లేటెస్ట్ మోడల్ ఎలెక్ట్రిక్ కార్లను కొంటున్నారు. వారికి భిన్నంగా మహేష్ బాబు రేంజ్ రోవర్ కొత్త మోడల్ కొన్నారు.
ఈ కారు బేసిక్ ధర మూడు కోట్ల రూపాయలు. తీసుకునే ఫీచర్స్, వేరియంట్ ని బట్టి నాలుగున్నర కోట్ల వరకు వెళ్తుంది. మహేష్ బాబు హై ఎండ్ మోడల్ తీసుకున్నట్లు సమాచారం.
మహేష్ బాబు ఎక్కువగా విదేశాల్లోనే గడుపుతుంటారు. తరుచుగా వెకేషన్ అంటూ ఫారిన్ కంట్రీస్ కి వెళ్లి వస్తుంటారు. హైదరాబాద్ లో ఉంటే షూటింగ్ లకు మాత్రమే బయటకి అడుగుపెడతారు. సినిమా షూటింగ్ లు, యాడ్స్ షూటింగ్ ల కోసమే బయటికి వస్తారు. లేదంటే ఇట్టిపట్టునే ఉండడం ఆయనకి ఇష్టం. ఐతే, హైదరాబాద్ రోడ్లపై కూడా కంఫర్ట్ గా ఉండే లగ్జరీ కారు కోసం ఇది తీసుకున్నట్లు సమాచారం.
మహేష్ బాబు సినిమాకి 60 కోట్లు తీసుకుంటారు. ఇక యాడ్స్, బ్రాండ్స్ ద్వారా అంతకన్నా ఎక్కువే సంపాదిస్తారు.