వివేక్ అగ్నిహోత్రి ఛాలెంజ్ వేస్ట్!

TeluguCinema 03 Sep 2023
The Vaccine War vs Salaar

“సలార్” సినిమా టీజర్ రాగానే దాని గురించి ఇన్ డైరెక్ట్ గా కామెంట్ చేశారు బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ రంజన్ అగ్నిహోత్రి. ఇలాంటి అర్ధరహితమైన హింసాత్మిక చిత్రాలను ఎంకరేజ్ చేయొద్దని ట్వీట్ చేశారు. అలాగే తన కొత్త చిత్రానికి రిలీజ్ డేట్ ని “సలార్”కి పోటీగా ఫిక్స్ చేశారు.

“ది వ్యాక్సిన్ వార్” పేరుతో వివేక్ అగ్నిహోత్రి కొత్త సినిమా చేశారు. సెప్టెంబర్ 28న ఈ సినిమా విడుదల కానుంది. “సలార్” సినిమాకి భయపడకుండా తన సినిమాకి డేట్ ప్రకటించారు. అంతేకాదు, తన సినిమా ఆడుతుందో, “సలార్” ఆడుతుందో చూద్దాం అన్నట్లుగా ఛాలెంజ్ విసిరారు. సోషల్ మీడియాలో వివేక్ అగ్నిహోత్రికి, ప్రభాస్ అభిమానులకు మాటల యుద్ధం కూడా జరిగింది.

కానీ అదంతా ఇప్పుడు వేస్ట్ అయింది. “సలార్” సినిమా వాయిదా పడింది. సెప్టెంబర్ 28న విడుదల కావడం లేదు. గ్రాఫిక్స్ పనుల్లో జాప్యం కారణంగా సినిమాని పోస్ట్ పోన్ చేశారు.

ఇప్పుడు, “ది వ్యాక్సిన్ వార్”కి బాలీవుడ్ లో పోటీలేదు. మరి ఈ సినిమా ఈ దర్శకుడి గత చిత్రం “ది కాశ్మీర్ ఫైల్స్” మాదిరిగా కళ్ళు చెదిరే హిట్ అవుతుందా అనేది చూడాలి.

TeluguCinema

View all posts

Recent News