ఆదివారం అదరగొట్టిన ఖుషి!

- Advertisement -
Kushi Trailer

“ఖుషి” సినిమాకి కలెక్షన్లు పెరిగాయి. ఆదివారం అన్నిచోట్లా అదరగొట్టింది. నైజాం(తెలంగాణ), అమెరికాలో ఉన్నంత దూకుడు ఆంధ్రా, రాయలసీమలో లేదు అని నిన్నటి వరకు కామెంట్స్ వినిపించాయి. కానీ, ఆదివారం అన్నిచోట్లా ఒకటే స్పందన… హౌస్ ఫుల్ బోర్డ్స్.

తిరుపతిలో మొదటి షోకి ఆరు థియేటర్లలకు 6 హౌసుఫుల్, వైజాగ్ లో కూడా ఆరు థియేటర్లు హౌసుఫుల్. విజయవాడలో నాలుగు, కాకినాడలో రెండు థియేటర్లు నిండాయి.

తమిళనాడులో కూడా అదే పరిస్థితి. ఆదివారం చెన్నైలో అనేక షోలు ఫుల్ అయ్యాయి. మొత్తంగా మొదటివారం మంచి వసూళ్లని అందుకొంది. విజయ్ దేవరకొండ చాలా ఆనందంలో ఉన్నాడు. ఆదివారం యాదాద్రికి వెళ్లి పూజలు చేశాడు. సాయంత్రం సంధ్య 70MMలో ఫ్యామిలీతో కలిసి సినిమా చూసి పరవశించి పోయాడు. ఎందుకంటే, “లైగర్” సినిమాని అదే థియేటర్లో సాధారణ ప్రేక్షకులతో కలిసి చూశాడు. కానీ, థియేటర్ నుంచి జనం మధ్యలోనే లేచిపోవడం చూసి బాధ పడ్డాడు. ఆ గాయం ఇప్పుడు మానుకొంది. అందుకే, “ఖుషి”తో ఈ హీరో ఖుషి.

సోమవారం “ఖుషి” సక్సెస్ ఈవెంట్ వైజాగ్ లో జరగనుంది.

 

More

Related Stories