దూకుడు మీదున్న జాన్వీ

TeluguCinema 02 Nov 2023
Janhvi Kapoor

జాన్వీ కపూర్ హీరోయిన్ గా తెలుగులో అరంగేట్రం చేస్తున్న మూవీ… దేవర. ఆమె షూటింగ్ లో జాయిన్ అయింది మొన్నే. ఒక నాలుగు రోజులు మాత్రమే షూటింగ్ లో పాల్గొంది. పాల్గొన్న నాలుగు రోజులకే ఆమె తన పాత్రకు సంబంధించిన ఫోటో, గెటప్ తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా విడుదల చేసింది.

ఇప్పుడు ఏ నటి, నటుడు కూడా దర్శకుడు, నిర్మాత అనుమతి లేకుండా ఎలాంటి గెటప్ ఫోటోలు విడుదల చెయ్యకూడదు. కానీ జాన్వీ ఆ పని చేసింది. ఆమె దూకుడు అలా ఉంది.

ఐతే, ఆమె మేకర్స్ అనుమతి పొందే ఈ ఫోటోని షేర్ చేసింది. ఆమె ఆ ఫోటో పెట్టడం వల్ల ఈ సినిమాకి చాలా హెల్ప్ అయింది. జాన్వీకి జాతీయ స్థాయిలో ఉన్న పాపులారిటీ, ఇన్ స్టాగ్రామ్ లో ఉన్న ఫాలొవర్స్ కారణంగా ఆ ఫోటోతో పాటు ‘దేవర’ అనే హాష్ టాగ్ కూడా బాగా వైరల్ అయింది. ఆ విధంగా మేకర్స్ కూడా హ్యాపీనే.

Photos: Janhvi Kapoor in a hotel room

జాన్వీ కపూర్ ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకొంది. బాలీవుడ్ లో ఆమె తీసుకునే పారితోషికం కన్నా అధికంగా ఈ సినిమాకి ఇస్తున్నారు. ఇది పాన్ ఇండియా లెవల్లో సూపర్ హిట్ ఐతే ఆమె క్రేజ్ మరింత పెరుగుతుంది. ఆమెకి ఇప్పటివరకు బాలీవుడ్ లో భారీ హిట్ లేదు. ఆమె సినిమాలు ఎక్కువగా డైరెక్ట్ గా ఓటిటిలోనే విడుదల అయ్యాయి. ఆ లెక్కన చూస్తే ఆమె కెరీర్లోనే ఇది బిగ్ మూవీ. అందుకే, ఈ భామ ఈ సినిమా విషయంలో చాలా ఎక్సయిట్ అవుతోంది.

Janhvi Kapoor in Devara

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా జాన్వీకి మంచి ఎలివేషన్ ఇస్తున్నారు.

TeluguCinema

View all posts

Recent News