వాళ్ళతో డేటింగ్ చెయ్యలేదంట

TeluguCinema 04 Aug 2025
Tamannaah

తమన్న ఇటీవలే తన బాయ్ ఫ్రెండ్ తో కటీఫ్ చేసుకొంది. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో రెండేళ్లు డేటింగ్ చేసి, బ్రేకప్ చెప్పుకొంది. తాజాగా ఆమె బరువు తగ్గి మళ్ళీ కెరీర్ పై ఫోకస్ పెట్టింది. అలాగే ఇంతకుముందు ఇద్దరు క్రికెటర్లతో అఫైర్ నడిపింది అన్న వార్తలకు కూడా ఆమె చెక్ పెట్టింది.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో గతంలో తాను ఎదురుకొన్న డేటింగ్ రూమర్స్ గురించి మాట్లాడింది.

“నేను క్రికెటర్ అబ్దుల్ రజాక్ ఒక షాప్ ఓపెనింగ్ వద్ద కలుసుకున్నాం. ఆ ఫోటోలు చూసి నేను అతన్ని సీక్రెట్ గా పెళ్లాడినట్లుగా మీడియా కథనాలు వండి వార్చింది. ఇది 2020లో జరిగింది. నేను షాక్ తిన్నాను ఆ ప్రచారం చూసి,” అని పేర్కొంది తమన్నా.

అలాగే, హీరోయిన్ అనుష్క శర్మని విరాట్ కోహ్లీ పెళ్లాడిన తర్వాత అతనికి, తనకు లింక్ పెట్టారని వాపోయింది.

“ఇది ఐతే మరీ ఘోరం. మేం ఇద్దరం ఒక యాడ్ లో నటించిన వెంటనే ఈ పుకార్లు పుట్టాయి. ఒకటే రోజు షూటింగ్ అది. ఆ తర్వాత మళ్ళీ నేను ఎప్పుడూ విరాట్ ని కలవలేదు. కానీ అలా వార్తలు పుట్టించారు,” అని గతంలో తాను ఫేస్ చేసిన పుకార్ల గురించి ఏకరువు పెట్టింది.