యోగి బాబుకి బ్రహ్మి ట్రీట్

TeluguCinema 08 Aug 2025
Yogi Babu with Brahmanandam

బ్రహ్మానందం హాస్యనటుడిగా ఒక లెజెండ్. వెయ్యికి పైగా చిత్రాల్లో హాస్య పాత్రలు పోషించి గిన్నిస్ బుక్ రికార్డు కూడా పొందారు. ఇప్పుడు వయసు రీత్యా ఆయనకి మునుపటిలా కమెడియన్ పాత్రలు రావడం లేదు. అడపాదడపా మాత్రమే సినిమాల్లో కనిపిస్తున్నారు.

ఇక తమిళ సినిమా రంగంలో ఇటీవల స్టార్ కమెడియన్ గా ఎదిగిన నటుడు యోగి బాబు. అతనికి చాలా క్రేజ్ ఉంది. తాజాగా ఆయన ఒక తెలుగు సినిమాల్లో నటిస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ కి వచ్చిన యోగి బాబుని బ్రహ్మానందం తన ఇంటికి పిలిచి, అతిథి సత్కారాలు జరిపారు.

బ్రహ్మానందం తాను ఇష్టంగా గీసిన ఒక పెయింటింగ్ ని కూడా యోగి బాబుకి బహుకరించారు. తన ఇంట్లో యోగి బాబుతో దిగిన ఫోటోలను కూడా షేర్ చేశారు.

లెజెండ్ బ్రహ్మానందంతో సినిమాల్లో నటించడమే కాదు ఆయనతో సత్కారం చేసుకోవడం అనందంగా ఉందని యోగి బాబు అన్నారు.