ఈ హీరోతో శ్రీలీల ఫస్ట్ సెల్ఫీ

హీరోలందరితో మంచి సంబంధాలు కొనసాగిస్తుంది శ్రీలీల. దాదాపు హీరోలందరికీ శ్రీలీల అంటే ఇష్టమే. రవితేజకు ఇంకాస్త ఎక్కువ ఇష్టం. ఎందుకంటే, తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ‘ధమాకా’ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించింది కాబట్టి.
ఇప్పుడు మరోసారి ఆమెతోనే సినిమా చేస్తున్నాడు రవితేజ. ఈ సినిమా పేరు ‘మాస్ జాతర’. ఈ సినిమా సెట్స్ నుంచి ఓ ఫొటో రిలీజ్ చేసింది శ్రీలీల. ఇప్పటికే ఆమె చాలా సెల్ఫీలు విడుదల చేసింది. తాజా సెల్ఫీకి మాత్రం ఓ ప్రత్యేకత ఉంది.
రవితేజతో శ్రీలీల దిగిన తొలి సెల్ఫీ ఇది. ఆమె చెప్పిన తర్వాత నిజమే కదా అనే ఫీలింగ్ వస్తుంది చాలామందికి. ఈ ఫొటోలో చీరకట్టులో సింపుల్ గా కనిపిస్తోంది శ్రీలీల. “Finally our first selfie sir,” అని రాసుకొంది ఇన్ స్టాగ్రామ్ లో ఈ ఫోటోని షేర్ చేస్తూ.
రీసెంట్ గా జగపతిబాబు నిర్వహించిన టాక్ షోకు హాజరైంది శ్రీలల. అందులో రవితేజను ప్రత్యేకంగా మెచ్చుకుంది. మహేష్, రవితేజలో ఎవరు ఎక్కువ యాక్టివ్ అనే ప్రశ్నకు ఠక్కున రవితేజ పేరు చెప్పింది. ఆయన చలాకీతనం నెక్ట్స్ లెవెల్ అంటూ కితాబిచ్చింది.