‘అఖండ 2’…బాలయ్య లీక్స్

TeluguCinema 05 Sep 2025
Nandamuri Balakrishna

అఖండ-2′ వాయిదా పడిందనే విషయం అధికారికం. అయితే కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు? త్వరలోనే ఆ విషయాన్ని ప్రకటిస్తామని యూనిట్ గతంలోనే తెలిపింది. అయితే చిరు లీక్స్ టైపులో ఈ విషయంలో బాలయ్య లీక్స్ బయటకొచ్చాయి.

తను నటించిన ‘అఖండ-2’ విడుదల తేదీని చెప్పేశారు బాలకృష్ణ. తన సినిమా డిసెంబర్ ఫస్ట్ వీక్ లో వస్తుందని క్లియర్ కట్ గా ప్రకటించేశారు. నిజానికి ఆయన ఈ విషయం చెప్పాలనుకోలేదు. ఈనెల 25న సినిమా రాదని మాత్రమే చెప్పాలనుకున్నారు.

కానీ ఏదైనా మాట్లాడేటప్పుడు ఫ్లోలో అలా వెళ్లిపోతుంటారు బాలయ్య. ఎక్కడో మొదలుపెట్టి, ఇంకెక్కడో ముగిస్తారు. ఈసారి కూడా నిమ్మకూరులో మాట్లాడుతూ, అదే ఊపులో విడుదల తేదీ చెప్పేశారు.

మరో ఇంట్రెస్టింగ్ మేటర్ ఏంటంటే.. ‘ఓజీ’ పోటీలో ఉండడం వల్ల ‘అఖండ-2’ వాయిదా వేయలేందంట. ఈ సినిమాకు పని చేయడానికి మరింత టైమ్ కావాలని తమన్ కోరాడంట. అందకే వాయిదా వేశారంట.