హ్యుమా ఖురేషి నిశ్చతార్ధం?

TeluguCinema 15 Sep 2025
Huma Qureshi

బాలీవుడ్ నటి హ్యుమా ఖురేషి దక్షిణాదిలో కూడా నటించింది. తమిళంలో రజినీకాంత్ సినిమా “కాలా”లో కీలక పాత్ర పోషించింది. అలాగే మరో తమిళ చిత్రం “వలిమై”లో కూడా నటించింది. హిందీలో “గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్”, “బదలాపూర్”, “గంగూబాయి” వంటి సినిమాల్లో నటించి, పేరుతెచ్చుకొంది.

ఈ అమ్మడు ఇప్పుడు తన వ్యక్తిగత జీవితంతో వార్తల్లో నిలిచింది.

కొన్నేళ్లుగా డేటింగ్ చేస్తోన్న Rachit Singh.అనే తన బాయ్ ఫ్రెండ్ ని హ్యూమా పెళ్లి చేసుకోబోతుందట. తాజాగా వీళ్ళిద్దరూ నిశ్చితార్థం జరుపుకున్నారు అని బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఐతే ఆమె తన ఇన్ స్టాగ్రామ్ లో ఎటువంటి అప్డేట్ పెట్టలేదు.

హ్యుమాకి ప్రస్తు తం 39 ఏళ్లు. ఇప్పటికే పెళ్లి ఆలస్యం అయింది. సో, ఈ ఏడాది లైఫ్ లో సెటిల్ కాబోతుంది ఈ భామ. ఆ మధ్య ఈ భామ మెగాస్టార్ చిరంజీవితో నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆమె ఇంతవరకు ఏ తెలుగుసినిమా ఒప్పుకోలేదు.