మరో కన్నడ భామ తెలుగు ఎంట్రీ

తెలుగు సినిమాలో ఇప్పుడు అంతా కన్నడ భామలదే రాజ్యం. రష్మిక టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. అంతకుముందు పూజ హెగ్డే టాప్ హీరోయిన్ గా కొనసాగింది. ఇటీవలే శ్రీనిధి శెట్టి తెలుగు తెరకు పరిచయం అయింది. అలాగే రుక్మిణి వసంత్ కూడా అవకాశాలు అందుకుంటోంది.
ఇప్పుడు మరో కన్నడ భామ తెలుగు తెరకు పరిచయం కానుంది. చైత్ర ఆచార్ (Chaithra J Achar) అనే అమ్మడు ప్రభాస్ సినిమాలో ఒక కీలక పాత్ర దక్కించుకొంది.
ప్రభాస్ హీరోగా దర్శకుడు హను రాఘవపూడి తీస్తున్న “Fauji” సినిమాలో చైత్ర రెండో హీరోయిన్ గా అవకాశం దక్కించుకొంది. మొదటి హీరోయిన్ గా కొత్త హీరోయిన్ ఇమాన్వి నటిస్తోంది. కన్నడ చిత్రాల్లో ఇంటెన్స్ రోల్స్ పోషించి పేరు తెచ్చుకున్న చైత్రకి కీలక పాత్ర దక్కింది.
చైత్ర ఆచార్ అందంతో కాదు అభినయంతో ఆకట్టుకొంది. “సప్త సాగరాలు సైడ్ బి” సినిమాలో ఆమె పోషించిన పాత్రకు బాగా పేరు వచ్చింది.