మరో సౌత్ సినిమాలో వామిక!

TeluguCinema 30 Oct 2025
Wamiqa Gabbi

వామిక ఇటీవల బాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకొంది. 2007లో విడుదలైన “జబ్ వి మెట్” సినిమాలో బాలనటిగా కనిపించిన వామిక హిందీ వెబ్ సిరీస్ లతో హీరోయిన్ గా పాపులర్ అయింది. ఆ తర్వాత “జూబిలీ”, “కూఫియా” వంటి హిందీ సినిమాలు ఆమెకి నటిగా పేరు తెచ్చిపెట్టాయి.

ఇప్పుడు సౌత్ సినిమాలపై ఫోకస్ పెట్టింది. పదేళ్ల క్రితం ఆమె ఒక తమిళ చిత్రం, అలాగే “భలే మంచి రోజు” అనే తెలుగు చిత్రంలో నటించింది. పదేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత ఆమె మళ్ళీ తెలుగు, తమిళ చిత్రాలపై దృష్టి పెట్టింది.

ప్రస్తుతం ఆమె తెలుగులో అడవి శేష్ సరసన “జీ 2” (గూఢచారి 2)లో నటిస్తోంది. అలాగే “జిని” అనే తమిళ చిత్రంలో కూడా ఉంది. ఈ రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.

తాజాగా ఈ భామ దర్శకుడు లోకేష్ కనగరాజ్ సరసన కూడా నటించనుందట. ఇటీవలే రజినీకాంత్ ని “కూలి”గా చూపించిన లోకేష్ డైరెక్షన్ ని బ్రేక్ ఇచ్చి హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. అతని సరసన వామికని తీసుకున్నారట.