శృతి హాసన్ కి ఎంతిచ్చారు?

శృతి హాసన్ సినిమాకి రెండు నుంచి మూడు కోట్లు తీసుకుంటుంది. ఆమెకి ఇటీవల పెద్ద హిట్స్ లేవు. అయినా ఆమెకి ఉన్న పాపులారిటీ కారణంగా మూడు వరకు ఇస్తున్నారు నిర్మాతలు. ఐతే, ఆమె గాయనిగా ఇటీవల ఒక పెద్ద సినిమాలో పని చేసింది. ఒక పాట పాడింది.
ఆ పాట సాదాసీదాది కాదు. ఆ సినిమా మామూలు మూవీ కాదు.
రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తోన్న సినిమాలో శృతి హాసన్ మెయిన్ సాంగ్ పాడింది. “సంచారి” అనే ఈ పాట హీరో పాత్రని, అతని ధీరోదాత్తతని చెప్పేలా ఉంది. సో సినిమా నేపథ్యగీతంగా ఇది ఉండేలా ఉంది. ఆ పాటని ఆమె స్టేజ్ పై కూడా ప్రదర్శించేందుకు అంగీకరించినట్లు సమాచారం.
అందుకే, ఆమెకి ఎంత ఇచ్చారు అనే దానిపై చర్చ జరుగుతోంది. కేవలం పాడితే 10, 20 లక్షలు ఇస్తారు. స్తేజ్ పై కూడా షో చెయ్యాలి అంటే ఆమెకి భారీగానే ఇవ్వాల్సి ఉంటుంది.
గతంలో ఆమె మహేష్ బాబు సరసన “శ్రీమంతుడు” వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఇప్పుడు అతని పాత్రని హైలెట్ చేసే సాంగ్ పాడింది శృతి. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్. సినిమాలో శృతి హాసన్ కి ఎలాంటి రోల్ ఇవ్వలేదు.