ఇక ఆ ముచ్చటా చెప్పేస్తే సరి!

TeluguCinema 13 Nov 2025
Vijay Deverakonda kisses Rashmika's hand

నిన్న విజయ్ దేవరకొండ “ది గర్ల్ ఫ్రెండ్” విజయోత్సవ సంబరాలకు ముఖ్య అతిథిగా విచ్చేశాడు. అంతే కాదు. ఆమెని పలకరిస్తూ ఆమె చేతిని తీసుకొని ముద్దాడాడు. దాంతో, అభిమానులు మురిసిపోయారు.

విజయ్ దేవరకొండ, రష్మిక మందాన మొదట “గీత గోవిందం” సినిమాలో జంటగా నటించారు. అది సంచలన విజయం సాధించింది. ఆ తర్వాత “డియర్ కామ్రేడ్”లో నటించారు. ఈ సినిమాలో నటిస్తున్నప్పుడే వీరి మధ్య ప్రేమ చిగురించింది. అలా మొదలైన డేటింగ్ ముదిరి పెళ్లి వరకు వచ్చింది.

గత నెలలో వీరికి నిశ్చితార్థం జరిగింది. విజయ్ దేవరకొండ ఇంట్లోనే వీరి ఎంగేజ్ మెంట్ పూర్తి అయింది. అయితే, ఇప్పటివరకు అధికారికంగా జరగబోయే పెళ్లి వేడుక గురించి కానీ, నిశ్చతార్ధం గురించి కానీ ఒక్క ముచ్చట చెప్పలేదు. సోషల్ మీడియాలో రాసుకోలేదు. నిన్న ముద్దుతో అందరికీ అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చినట్లైంది.

ఇక అదే వేడుకలో, రష్మిక మాట్లాడుతూ తన జీవితంలో విజయ్ దేవరకొండ ఉన్నట్లు ప్రకటించింది. “విజయ్ లాంటి వ్యక్తి ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటే అదొక బ్లెస్సింగ్ అనుకోవాలి,” అని ఆమె ప్రకటించింది. తన జీవితంలో అతను ఉన్నాడు అని అలా తెలిపింది.

ఇదంతా ఓకె కానీ తమ పెళ్లి డేట్ గురించి, ఇతర వివరాలు అధికారికంగా సోషల్ మీడియాలో షేర్ చేస్తే, ఆ ముచ్చటా కూడా అభిమానులకు తీరుతుంది కదా.