ఆ పొన్ను…ఈ బేగమ్

పొన్నియన్ సెల్వన్” సినిమాలో టీనేజ్ వయసులో ఉన్న నందిని గుర్తుందా? ఆ పాత్రలో సారా అర్జున్ నటించింది. నందిని పాత్రని ఐశ్వర్య రాయ్ పోషించగా, ఆమె టీనేజ్ రోల్ లో సారా కనిపించింది. టీనేజ్ లోనే ఆకట్టుకొంది సారా.
మణిరత్నం తీసిన “పొన్నియన్ సెల్వన్” విడుదలై నాలుగేళ్లు అయిపోయింది. ఆ పిల్ల ఇప్పుడు 20 ఏళ్లకి వచ్చింది. మణిరత్నం సినిమాలో నటించినప్ప్పుడు ఆమెకి 16 ఏళ్ళు. ఇప్పుడు ఈ భామ “ధురంధర్” అనే బాలీవుడ్ చిత్రంతో మెయిన్ హీరోయిన్ గా అరంగేట్రం చేస్తోంది.
బాలీవుడ్ కథానాయకుడు రణ్వీర్ సింగ్ సరసన ఆమె నటిస్తోంది. రణ్వీర్ సింగ్ కి 40. ఈ భామకి 20.
ఇద్దరి మధ్యలో 20 ఏళ్ల గ్యాప్ ఉంది అని సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు. హిందీ సినిమాల్లోనే ఈ సమస్య ఉంటుంది. మన దగ్గర 65 – 70 ఏళ్ల హీరోలు కూడా పాతికేళ్ల భామలతో రొమాంటిక్ గా నటిస్తారు. 50 ఏళ్ల మహేష్ బాబు, 55 ఏళ్ల రవితేజ 23 ఏళ్ల శ్రీలీలతో సినిమాలు చేశారు. కానీ ఇక్కడ ఎవరూ పెద్దగా ట్రోల్ చెయ్యలేదు.
తాజాగా 65 ఏళ్ల నందమూరి బాలకృష్ణ 30 ఇయర్స్ సంయుక్తతో “జాజికాయ” అంటూ డ్యాన్స్ చేశారు. కానీ పాపం 40 ఏళ్ల రణ్వీర్ సింగ్ సారాతో కలిసి నటించినందుకు తిట్లు పడుతున్నాడు.