Rasha Thadani: మరో పాయల్ అవుతుందా?

రవీనా టాండన్ కూతురు రష (Rasha Thadani) తెలుగులోకి అడుగుపెడుతోంది. ఆమె మొదటి చిత్రం పేరు.. శ్రీనివాస మంగాపురం. ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం అవుతున్నాడు. ఇక రష తెలుగులోకి పరిచయం అవుతోంది. దాంతో అందరి చూపులు ఈ భామపై పడ్డాయి.
నిజానికి ఆమె మొదట రామ్ చరణ్ “పెద్ది” సినిమా కోసం ఆడిషన్ చేసింది. దాదాపుగా ఆమె పేరుని కన్ఫర్మ్ చేశారు. కానీ దర్శకుడు బుచ్చిబాబు మాత్రం జాన్వీ కపూర్ అయితేనే సినిమాకి బాగుంటుందని పట్టుపట్టడంతో రషకి అలా పెద్ది సినిమాతో ఇంట్రడ్యూస్ అయ్యే అవకాశం దక్కలేదు.
రషకి ఇప్పటికే బాలీవుడ్ లో గ్లామర్ గాళ్ గా గుర్తింపు దక్కింది. ఆమె తన మొదటి బాలీవుడ్ చిత్రం “ఆజాద్” (Azaad)లో చేసిన డ్యాన్స్ నంబర్ బాగా వైరల్ అయింది. ఆ పాట… ఉయి అమ్మ.
మధుబంతి పాడిన “ఉయి అమ్మ” (Uyi Amma) అనే పాట ఎంత పాపులర్ అంటే ఈ ఏడాది అత్యధిక వ్యూస్ పొందిన రెండో ఇండియన్ మూవీ సాంగ్ గా యూట్యూబ్ లో క్రెడిట్ పొందింది. ఈ పాటకి ప్రస్తుతం 450 మిలియన్ల వ్యూస్ దక్కాయి. దాదాపుగా ఐటెం సాంగ్ లా ఉండే ఈ పాటలో రష తన అందచందాలు బాగానే ఒలకబోసింది. అలాగే తన డ్యాన్స్ స్కిల్స్ కూడా ప్రదర్శించింది.
