‘ది రాజాసాబ్’ 3 గంటలపైనే

ప్రభాస్ నటించిన “ది రాజా సాబ్” చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. ఇప్పటికే మొదటి పాట వచ్చింది. ట్రైలర్ వచ్చింది, టీజర్ కూడా చాలా కాలం క్రితమే రిలీజయ్యింది. ఇక మరికొన్ని పాటలు విడుదల కావాలి. ఒక పెద్ద ప్రీ రిలీజ్ ఈవెంట్ బాకీ ఉంది.
ఈ సినిమా జనవరి 9న విడుదల కానుంది. అమెరికాలో జనవరి 8న భారీ ఎత్తున ప్రీమియర్ షోలు వేస్తున్నారు. దాదాపు 10 మిలియన్ల వసూళ్లు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఐతే, అమెరికన్ డిస్ట్రిబ్యూటర్ ఈ సినిమా నిడివి 3 గంటల 15 నిమిషాలు ఉంటుంది అని పోస్టర్ లో మెన్షన్ చెయ్యడం విశేషం.
ఇటీవల మూడు గంటలకు పైనే నిడివి ఉన్న చిత్రాలు చాలానే వచ్చాయి, హిట్ అయ్యాయి. పుష్ప 2, యానిమల్ చిత్రాలు మూడు గంటల 15 నిమిషాలు, మూడు గంటల 20 నిమిషాలతో విడుదల అయ్యాయి. ఆ లెక్కన చూస్తే రాజాసాబ్ కి ఈ రన్ టైం పెద్ద సమస్య కాదు. కాకపోతే దర్శకుడు మారుతి ఇంతవరకు అంత భారీ నిడివితో సినిమాలు మునుపు చెయ్యలేదు. అది ఒక సమస్య. మరోటి ఈ జానర్ లో అంత నిడివి అంటే బోర్ ఫీల్ అవుతారు ప్రేక్షకులు అనే మాట ఉంది.
ఫైనల్ గా ఈ సినిమాకి ఎంత రన్ టైం ఉంటుంది అనేది సెన్సార్ పూర్తి అయ్యాకే తెలుస్తుంది.