BMWపైనే డింపుల్ ఆశలన్నీ!

డింపుల్ హయతి ఇటీవల ఎక్కువగా వివాదాల్లో ఇరుక్కొంది. ఆమె హైదరాబాద్ లో తన లివ్ -ఇన్ పార్ట్ నర్ తో కలిసి ఉంటోంది. మొదట ఆమె, ఆమె పార్ట్ నర్ ఒక ఐపీఎస్ అధికారితో గొడవ పెట్టుకున్నారు. ఇటీవల తమ ఇంట్లో పని చేసే పనివారికి డబ్బులు ఎగ్గొట్టి వార్తల్లో నిలిచారు. ఇలాంటి వివాదాలు, కేసులు ఎలా ఉన్నా ఇప్పుడు హీరోయిన్ గా నిలబడేందుకు ప్రయత్నిస్తోంది ఈ భామ.
తాజాగా ఆమె రవితేజ సరసన “భర్త మహాశయులకు విజ్ఞప్తి” (BMW) అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో ఆషిక రంగనాథ్ ఒక హీరోయిన్ కాగా మరో హీరోయిన్ గా ఈ భామ కనిపిస్తోంది. తాజాగా “అద్దం ముందు” అనే రొమాంటిక్ గీతం ఈ సినిమా నుంచి విడుదలైంది. ఈ పాటలో రవితేజ, డింపుల్ మధ్య మంచి కెమిస్ట్రీ కనిపించింది.
ఈ సినిమా హిట్టయితే తనకి మరిన్ని అవకాశాలకు మార్గం పడుతుంది అని భావిస్తోంది ఈ భామ.
ALSO READ: Dimple Hayathi blends bold and classy styles
ఈ భామ అందాలు అరబోయడంలో అస్సలు వెనుకాడదు. బికినీ షూట్లు కూడా చేస్తూ ఉంటుంది. ఐతే ఎక్స్పోజింగ్ ఎంత చేసినా సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఉంటేనే కెరీర్ ఉంటుంది. అందుకే, ఈ భామ సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్ లు షేర్ చేస్తూ, సినిమాల్లో రవితేజ వంటి సీనియర్ హీరోలతో అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది.

డింపుల్ ఇంతకుముందు రవితేజ సరసన “ఖిలాడీ” సినిమాలో నటించింది. కానీ అది ఆడలేదు. ఈ రెండో సినిమాతోనైనా తన కెరీర్ గాడిలో పడాలని భావిస్తోంది. కన్నడంలో ఒక సినిమా ఉంది. ఈ రెండు సినిమాలే ఆమె చేతిలో ఉన్న ఆఫర్లు.