సంక్రాంతి సినిమాలకు సమస్య లేదు

తెలంగాణాలో ఇక టికెట్ రేట్లు పెరగవు, పెంచబోము అని ముఖ్యమంత్రి, సినిమాటోగ్రఫీ మంత్రి చాలా సార్లు చెప్పారు. అయినా పెంచుతూనే ఉన్నారు పెద్ద సినిమాల విడుదల సమయంలో. తాజాగా “అఖండ 2” విడుదల టికెట్ రేట్ల పెంపు విషయంలో హైకోర్టు తప్పు పట్టిన తర్వాత మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇకపై అస్సలు పెంపు ఆలోచనే ఉండదు అన్నారు. అంతే కాదు సినిమా నిర్మాతలు కూడా అలాంటి ప్రతిపాదనలు చెయ్యొద్దు అని ప్రకటించారు.
ఐతే, ఇండస్ట్రీ సమాచారం ప్రకారం సంక్రాంతి పెద్ద సినిమాలకు పెంచేందుకు ప్రభుత్వం సుముఖంగానే ఉందట. “ది రాజాసాబ్” వంటి భారీ సినిమాకి టికెట్ రేట్లు పెరగకపోతే ఇబ్బంది. అందుకే, ఈ విషయంలో వర్రీ అయిన నిర్మాత ఇప్పటికే ప్రభుత్వ పెద్దలను సంప్రదించారట. ఎలాగోలా పెంచేలా చూస్తామని మాటిచ్చారట.
ఈ సంక్రాంతికి “మన శంకర వరప్రసాద్ గారు”, “ది రాజాసాబ్”, “నారి నారి నడుమ మురారి”, “భర్త మహాశయులకు విజ్ఞప్తి”, “అనగనగా ఒక రాజు” చిత్రాలు విడుదల అవుతున్నాయి. ఇందులో పాన్ ఇండియా భారీ చిత్రం.. ప్రభాస్ నటించిన “ది రాజాసాబ్” దీనికి టికెట్ రేట్ల పెంపు కావాలి.
తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక టికెట్ రేట్ల విషయంలో ఎన్నో ప్రకటనలు చేసింది, మాట తప్పింది.