అప్పుడే ‘మాల’ వేసుకున్న రామ్ చరణ్

రామ్ చరణ్ అయ్యప్ప స్వామి భక్తుడు. నేటితరం అగ్ర హీరోల్లో అత్యంత భక్తిప్రవత్తులతో ప్రతి ఏడాది దీక్షని పాటించే హీరో రామ్ చరణ్ మాత్రమే. ప్రతి ఏడాది నవంబర్, డిసెంబర్ లలో అయ్యప్ప మాల వేసుకొని 40 రోజులు దీక్ష పాటిస్తారు. కానీ ఈ సారి ముందే మాల వేసుకున్నారు చరణ్.
డిసెంబర్ లో దర్శకుడు శంకర్ తీసే భారీ చిత్రానికి సంబంధించిన ఒక కొన్ని కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ కోసం పలు ప్రాంతాలు వెళ్లాల్సి ఉంటుంది. అందుకే, ఈ సారి ముందే దీక్ష పట్టారు చరణ్. ఈ 40 రోజులు అయ్యప్ప స్వామి దీక్షకి ధరించే నల్లటి దుస్తులు మాత్రమే వేసుకొంటాడు. సినిమా షూటింగ్ ఉంటే ఆ సీన్ కి కావాల్సిన వేసుకొని సీన్ అయిపోగానే అయ్యప్ప మాల దుస్తుల్లోకి షిఫ్ట్ అయిపోతారు.
మరోవైపు, రామ్ చరణ్ వరుసగా మూడు సినిమాలు ప్రకటించారు. శంకర్ దర్శకత్వంలో ఒక మూవీ త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఆ తర్వాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమా మొదలవుతుంది. అలాగే, దర్శకుడు ప్రశాంత్ నీల్ తీసే చిత్రం కూడా అంగీకరించారు చరణ్.
“ఆర్ ఆర్ ఆర్” తర్వాత తన కెరీర్ ఇలా ఉండాలో చరణ్ పక్కాగా ప్లాన్ వేసుకొని సినిమాలు సైన్ చెయ్యడం విశేషం.