కొన్ని తీసేసింది, కొన్ని ఉంచింది!

TeluguCinema 28 Oct 2021
Naga Chaitanya and Samantha


సమంత, నాగ చైతన్య తాము భార్యాభర్తలుగా విడిపోతున్నట్లు ప్రకటించి దాదాపు నెల కావొస్తోంది. చైతన్యతో కలిసి దిగిన ఫోటోలను ఇప్పుడు తొలగిస్తున్నట్లు కనిపిస్తోంది.

ఆమె తన భర్త నాగ చైతన్యతో కలిసి దిగిన అనేక ఫోటోలను గతంలో ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. కానీ, ఇపుడు విడిపోయారు కాబట్టి వాటిని తొలగిస్తోంది. ఐతే, అన్ని ఫోటోలు తీయలేదు. ఇప్పటికీ, వారిద్దరూ కలిసి ఉన్న కొన్ని ఫోటోలు ఆమె ఇన్ స్టాగ్రామ్ టైంలైన్లో కనిపిస్తున్నాయి. కొన్ని మాత్రం ఎగిరిపోయాయి. బహుశా…. ఒక్కొక్కటిగా తొలగిస్తోందేమో. కొద్దిరోజులకు వారి కాపురం, దాంపత్య జీవితానికి సంబంధించిన అన్ని గురుతులు తొలగిస్తుందేమో.

నాగ చైతన్య ఇన్ స్టాగ్రామ్ లో పెద్దగా యాక్టివ్ గా ఉండడు. అతను తన పర్సనల్ లైఫ్ కి చెందిన ఫోటోలను పెద్దగా షేర్ చెయ్యలేదు. ఐతే,
ఇప్పటికీ ఇద్దరూ ఒకరినొకరు ఇన్ స్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నారు.

ప్రస్తుతం ఈ జంట వేర్వేరుగా జీవిస్తున్నారు. కోర్టు వీరికి ఇంకా విడాకులు గ్రాంట్ చెయ్యలేదు.

TeluguCinema

View all posts

Recent News